మంచి నిర్ణయం, దౌత్యవేత్తగా అతను అద్భుతం: ఒమర్
న్యూఢిల్లీ: భారత విదేశాంగ నూతన కార్యదర్శిగా జై శంకర్ నియామకాన్ని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. భారత విదేశాంగ కార్యదర్శిగా జై శంకర్‌ను నియమించడం మంచి నిర్ణమయని ఆయన పేర్కొన్నారు.

వాజ్‌పేయి ప్రధాని మంత్రిగా ఉన్న సమయంలో ఒమర్ అబ్దుల్లా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో జై శంకర్ ప్రాగు అంబాసిడర్‌గా పని చేశారని గుర్తు చేసుకున్నారు. దౌత్యవేత్తగా అతను అద్భుతంగా పని చేస్తారని, దానిలో ఎటువంటి సందేహం లేదని మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
Remember him from my days as MoS MEA & he was Amb in Prague. He's a top notch diplomat & will make an excellent FS no doubt about it. 2/2
— Omar Abdullah (@abdullah_omar) January 28, 2015 If the reports about Indian Ambassador to US Jaishankar being appointed Foreign Secretary are correct it's an excellent decision 1/2
— Omar Abdullah (@abdullah_omar) January 28, 2015 జైశంకర్ భారత విదేశాంగ నూతన కార్యదర్శిగా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను తన ఛాంబర్‌లో కలుసుకున్నారు. ఇంత వరకు విదేశాంగ కార్యదర్శిగా ఉన్న సుజాతా సింగ్ పదవీ కాలం ఇంకా 8 నెలలు మిగిలి ఉండగానే ఆమెను పదవి నుంచి తప్పించారు.
నరేంద్రమోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన నియామకాలపై మంత్రివర్గ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 1977 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జైశంకర్ అమెరికాలో భారత రాయబారిగా ఉన్నారు. విదేశాంగ కార్యదర్శిగా ఆయన రెండేళ్ల కాలం ఈ పదవిలో కొనసాగుతారు.












Click it and Unblock the Notifications