షాక్! : ప్రధాని మోడీ ఫొటోకు దండేసి నివాళులు! ఓ బీజేపీ మేయర్ నిర్వాకం!!

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇండోర్: మనం ఎవరినైనా గౌరవించాలనుకుంటే.. అందుకు పలు మార్గాలున్నాయి. ఒకటి శాలువా కప్పి సత్కరించడం, మరొకటి పూలదండ వేసి గౌరవించడం. కానీ ఎవరి ఫొటోకైనా దండేసి.. నివాళులు అర్పించారంటే మాత్రం అది కచ్చితంగా మరణించిన వారే అయి ఉంటారు.

కానీ, ఓ బీజేపీ నాయకురాలు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటోకు దండేసి నివాళులు అర్పించేసింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటు చేసుకుంది.

narendra modi

ఇండోర్ మేయర్ మాలినీ గౌవద్ మరణించిన తన భర్త ఫొటో పక్కన ప్రధాని మోడీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఫొటోలు ఉంచి.. వాటికి దండలేసి నివాళులు అర్పించింది. దివంగత మాజీ కేబినెట్ మంత్రి లక్ష్మణ్ సింగ్ గౌవద్ సతీమణి ఈ మాలినీ గౌవద్. ఈమె ఈ పని తెలిసి చేసిందో, తెలియక చేసిందో అంతుబట్టడం లేదు.

ఆమె ఇటీవల తన ఇంట్లో ఓ వేడుక సందర్భంగా ఇలా ముగ్గురి ఫొటోలకు దండలు వేసి కలకలం రేపారు. ఈ ఘటనపై స్పందించడానికి స్థానిక బీజేపీ నేతలు నిరాకరిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జితు పట్వారీ మేయర్ తీరును తప్పుబట్టారు.

ఆమె బీజేపీ నాయకురాలైనందున ఆ పార్టీ చర్య తీసుకోవడం లేదని, ఇదే పని ఇతరులెవరైనా చేసి ఉంటే నానా రాద్ధాంతం చేసి ఉండేవారని ఆయన విమర్శించారు. గతంలో డాక్టర్ అబ్దుల్ కలాం, అటల్ బిహారీ వాజ్ పేయి విషయంలోనూ ఇలాగే జరిగింది. కొందరు వారు బతికుండగానే ఫొటోలకు దండలేసి నివాళులు అర్పించిన ఘటనలు అప్పట్లో కూడా దుమారం రేపాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
What will be your reaction if you see Prime Minister Narendra Modi’s picture with a garland? This just happened! Indore Mayor Malini Gaud paid floral tributes to Narendra Modi and Madhya Pradesh CM Shivraj Singh Chouhan along with putting a garland on her dead husband’s picture.
Please Wait while comments are loading...