వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron: బయోలాజికల్ యుద్ధానికి సనద్ధం కావాల్సిందే: కౌంటర్ అటాక్‌ తప్పదు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. నాలుగు రాష్ట్రాల్లో తిష్ఠ వేసింది. ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుదల బాట పట్టింది. ఇప్పటికే 21 కేసులు వెలుగులోకి వచ్చాయి. వాటి సంఖ్య పెరిగింది కూడా. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌, ఢిల్లీలల్లో ఈ కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వాటి సంఖ్య పెరగదనడానికి ఎలాంటి గ్యారంటీ ఉండట్లేదు. మహారాష్ట్రలో రెండు పాజిటివ్ కేసులు కొత్తగా రికార్డయ్యాయి.

తెలంగాణలో 104 సర్వీసులు బంద్?: పల్లె దవాఖానాలు అందుకే: వైఎస్ షర్మిల ఆరోపణల వెనుకతెలంగాణలో 104 సర్వీసులు బంద్?: పల్లె దవాఖానాలు అందుకే: వైఎస్ షర్మిల ఆరోపణల వెనుక

ఒమిక్రాన్‌తో కలకలం..

ఒమిక్రాన్‌తో కలకలం..

కరోనా వైరస్ కొత్త రూపం ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోండటం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. ఇదివరకు కరోనా వైరస్‌కు సంబంధించిన ఒకట్రెండు వేరియంట్లు బయటపడ్డాయి. అవి పెద్దగా ప్రమాదకరంగా మారలేదు. డెల్టా, డెల్టా వేరియంట్, ఇతర మ్యూటెంట్లు అదృష్టశావత్తూ కరోనా వైరస్ తీవ్రతను పెంచలేకపోయాయి. ఈ వేరియంట్‌పై వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేశాయి. దాన్ని నియంత్రించగలిగాయి. ఫలితంగా డెల్టా ప్లస్ పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. ఈ వేరియంట్ల బారిన పడి మరణించిన వారి సంఖ్య పరిమితంగా నమోదైంది.

బయోవార్‌కు సన్నద్దం..

బయోవార్‌కు సన్నద్దం..

ఈ పరిణామాల మధ్య చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బయోలాజికల్ వార్‌ఫేర్‌కు అన్ని దేశాలు సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ల వంటివి బయోలాజికల్ యుద్ధానికి దారి తీసేలా ఉంటే- దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టడానికి అన్ని దేశాలు సమాయాత్తం కావాల్సి ఉంటుందని చెప్పారు. వైరస్, వ్యాధులను ఎదుర్కొనడానికి ఏకం కావాలని అన్నా

 బిమ్స్‌టెక్ అత్యున్నత సదస్సు..

బిమ్స్‌టెక్ అత్యున్నత సదస్సు..

ప్యానెక్స్ 21 అత్యున్నత స్థాయి సమావేశం కర్టెన్ రైజర్ కార్యక్రమంలో బిపిన్ రావత్ పాల్గొన్నారు. బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, భూటాన్, థాయ్‌లాండ్, శ్రీలంక (బిమ్స్‌టెక్) దేశాల ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు. కోవిడ్ 19 తరహా పరిస్థితులు సరికొత్త సవాళ్లను విసురుతున్నాయని బిపిన్ రావత్ పేర్కొన్నారు. ఇలాంటివి ఇదివరకెప్పుడూ లేవని గుర్తు చేశారు. ఇలాంటి వైరస్‌ల నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఆర్మీపైనా ఉందని చెప్పారు.

సరిహద్దులను దాటుకుని వస్తున్నాయ్..

భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె మాట్లాడుతూ- వైరస్‌ల తీవ్రత ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదని పేర్కొన్నారు. ప్రతి దేశం కూడా దీని బారిన పడుతోందని చెప్పారు. సరిహద్దులను దాటుకుని దేశంలోకి ప్రవేశిస్తోన్న ఇలాంటి మహమ్మారిని నిర్మూలించడానికి అన్ని దేశాలు ఏకం కావాలని అన్నారు. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం ఏ రకంగా సైన్యం పహారా కాస్తుందో.. అలాంటి అప్రమత్తత దేశం లోపల కూడా అవసరమైందని చెప్పారు.

వాతావరణ మార్పులు కారణం..

వాతావరణ మార్పులు కారణం..

వాతావరణ మార్పులు, ఒక ప్రణాళిక అంటూ లేని పట్టణీకరణ, అభివృద్ధికి నోచుకోకపోవడం, పేదరికం వంటి పరిస్థితులు మహమ్మారులను పుట్టిస్తున్నాయని మనోజ్ ముకుంద్ నరవణె అన్నారు. వాటి ఫ్రీక్వెన్సీని రెట్టింపు చేస్తోన్నాయని చెప్పారు. ఈ తరహా పరిస్థితులు అన్ని దేశాల్లోనూ ఉన్నాయని, వాటిని రూపుమాపడానికి స్థానిక పరిస్థితులక అనుగుణంగా, అనుకూలంగా ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

English summary
Amid raising of Omicron variant, CDS Gen Bipin Rawat said that it is very important for all the nations to put their heads together and support each other if there is any disaster.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X