• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణాలు తీయడం మొదలు పెట్టిన ఒమిక్రాన్: అక్కడ తొలి మరణం: అధికారికంగా ప్రకటించిన ప్రధాని

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పటికే 60కి పైగా దేశాలకు పాకిందీ వేరియంట్. భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు. భారత్‌లో 36 ఒమిక్రాన్ కేసులు ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చాయి. ఎవ్వరు కూడా మరణించకపోవడం కొంత ఊరట కలిగిస్తూ వచ్చింది. కరోనా వైరస్ తరహాలో ప్రాణాలను తీయట్లేదని భావిస్తూ వచ్చారంతా. ఇప్పుడు ఆ ఆశలు అడుగంటినట్టే. ప్రాణాలను తీయడం కూడా మొదలు పెట్టింది ఒమిక్రాన్.

కరీనాకు సోకిన కరోనా: అమృత అరోరాకు కూడా: కోవిడ్ ప్రొటోకాల్స్ బేఖాతర్..నైట్ పార్టీలుకరీనాకు సోకిన కరోనా: అమృత అరోరాకు కూడా: కోవిడ్ ప్రొటోకాల్స్ బేఖాతర్..నైట్ పార్టీలు

బ్రిటన్‌లో తొలి ఒమిక్రాన్ వేరియంట్ మరణం నమోదైంది. ఒమిక్రాన్ వల్ల ఓ పేషెంట్ మృత్యువాత పడటం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఒమిక్రాన్ వేరియంట్ తొలిసారిగా వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికా గానీ, బోట్సు‌వానాలో గానీ మరణాలు నమోదు కాలేదు. దీనికి భిన్నంగా ఆఫ్రికన్ దేశాల నుంచి బ్రిటన్‌కు వెళ్లిన ఒకరు మృతి చెందాడు. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అధికారికంగా ప్రకటించారు.

 Omicron death: First patient had died after contracting the Omicron variant, says Britain PM

లండన్ పశ్చిమ ప్రాంతంలోని పెడ్డింగ్టన్‌లో కొద్దిసేపటి కిందటే ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒమిక్రాన్ వేరియంట్ తొలి మరణం నమోదైందని తెలిపారు. ఇప్పటిదాకా ఈ వైరస్ వల్ల పేషెంట్లు అనారోగ్యం బారిన పడుతూ వచ్చారని, ఇప్పుడు ఒమిక్రాన్ తీవ్రత ఈ పరిస్థితి దాటిందని అన్నారు. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్‌ను ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని బోరిస్ జాన్సన్ విజ్ఞప్తి చేశారు. బూస్టర్ డోసులను అందించడం ద్వారా ఈ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందడాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.

లండన్‌లోని వేర్వేరు ఆసుపత్రుల్లో ప్రస్తుతం 10 మంది ఒమిక్రాన్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారని బ్రిటన్ వైద్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. థర్డ్ వేవ్ వస్తుందంటూ ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఆందోళనలు వ్యక్తమౌతోన్న వేళ.. ఒమిక్రాన్ వల్ల తొలి మరణం నమోదు కావడం కలకలం రేపుతోంది. ఈ మరణాన్ని దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ ప్రభుత్వం మరిన్ని ఆంక్షలను విధించే అవకాశాలు లేకపోలేదు.

ఇదివరకు కరోనా వైరస్‌కు సంబంధించిన ఒకట్రెండు వేరియంట్లు బయటపడ్డాయి. అవి పెద్దగా ప్రమాదకరంగా మారలేదు. డెల్టా, డెల్టా వేరియంట్, ఇతర మ్యూటెంట్లు అదృష్టశావత్తూ కరోనా వైరస్ తీవ్రతను పెంచలేకపోయాయి. ఈ వేరియంట్‌పై వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేశాయి. దాన్ని నియంత్రించగలిగాయి. ఫలితంగా డెల్టా ప్లస్ పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. ఈ వేరియంట్ల బారిన పడి మరణించిన వారి సంఖ్య పరిమితంగా నమోదైంది.

Recommended Video

  Omicron Variant : Omicron Case In AP Vizianagaram | Omicron Cases In India

  కొత్తగా దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ మాత్రం అత్యంత ప్రమాదకరమైనదిగా తయారైంది. డెల్టా వేరియంట్ల కంటే మూడు నుంచి మూడున్నర రెట్లు తీవ్రతను కలిగి ఉంది. అంతే వేగంతో వ్యాప్తి చెందే లక్షణం దీనికి ఉంది. అందుకే- చాలా వేగంగా ఈ వేరియంట్ అనేక దేశాలకు వ్యాప్తి చెందింది. భారత్ సహా ఇప్పటిదాకా 39 దేశాల్లో వ్యాప్తి చెందిందీ ఒమిక్రాన్ వేరియంట్. ఇది అక్కడితో ఆగేలా లేదు. రోజుకో కొత్త దేశంలో అడుగు పెడుతోంది.

  English summary
  British Prime Minister Boris Johnson said on Monday the first patient had died after contracting the Omicron variant of the coronavirus.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X