India Bloc: డీఎంకే అవుట్-టీవీకే ఇన్ ? ఇండియా కూటమి కీలక భేటీ..!
కేంద్రంలో అధికార బీజేపీకి, ఎన్డీయేకు వ్యతిరేకంగా గత ఎన్నికలకు ముందు జట్టు కట్టిన విపక్ష ఇండియా కూటమి (India Bloc) లో తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు చిచ్చుపెట్టాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే (DMK) కూటమిని వీడి కాంగ్రెస్ పార్టీ విజయ్ టీవీకే (TVK) కు మద్దతుగా నిలవడంతో స్టాలిన్ ఆగ్రహంగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ కు కొత్త మిత్రుడు విజయ్ పార్టీ టీవీకే నానాటికీ దగ్గరవుతోంది. దీంతో ఇవాళ జరిగే ఇండియా కూటమి భేటీపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపించబోతోంది.
ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ఇవాళ భేటీ కావాలని ఇండియా కూటమి పక్షాలు నిర్ణయించాయి. తమిళనాడుతో పాటే జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమిపాలైన మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఇండియా కూటమి భేటీ కోసం ఒత్తిడి చేస్తోంది. ఈ ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ ఏర్పాటు చేసి పార్టీల మధ్య సమన్వయం సాధించడం, భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయడంపై దృష్టిసారించబోతున్నారు.

ఇవాళ మొత్తం 23 విపక్ష పార్టీల నేతలు ఇండియా కూటమి భేటీకి హాజరవుతున్నాయి. డీఎంకే, ఆప్ మాత్రం దూరంగా ఉండబోతున్నాయి. అదే సమయంలో విజయ్ పార్టీ టీవీకే ప్రతినిధి కానీ, స్వయంగా విజయ్ కానీ ఈ భేటీకి హాజరవుతారని తెలుస్తోంది. ఈ సమావేశానికి కొన్ని పార్టీలు గైర్హాజరు అవుతున్నా అంతిమంగా అవి ఎన్డీయేకు వ్యతిరేకంగానే ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ వెల్లడించారు. ఇండియా కూటమి చివరి సారిగా గతేడాది ఆగస్టు 7న భేటీ అయింది. ఆ తర్వాత మళ్లీ సమావేశాలు జరగలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications