ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్, నేను 25 రోజులైనా బాధపడుతున్నా: సీజేఐ ఎన్వీ రమణ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా గత కొద్ది వారాల వరకు పెరిగిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ వ్యాప్తి వేగం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అయితే, ఈ వేరియంట్‌ను తక్కువ అంచనా వేయొద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే, ఈ క్రమంలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒమిక్రాన్ సోకినప్పటికీ.. అనారోగ్యంతో బాధపడుతున్నా..: సీజేఐ ఎన్వీరమణ

ఒమిక్రాన్ సోకినప్పటికీ.. అనారోగ్యంతో బాధపడుతున్నా..: సీజేఐ ఎన్వీరమణ

ఒమిక్రాన్ సోకి తగ్గినప్పటికీ.. దాని ప్రభావంతో తాను ఇంకా బాధపడుతున్నానని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. సుప్రీంకోర్టులో పూర్తిస్థాయిలో బౌథిక విచారణలు ప్రారంభించాలని ఓ సీనియర్ న్యాయవాది చేసిన అభ్యర్థనకు సీజీఐ ఈ మేరకు స్పందించారు. భౌతిక విచారణలు పాక్షికంగా మొదలవడం ఆనందంగా ఉందన్నారు. అయితే, ఒమిక్రాన్ ఇప్పుడు వైరల్ జ్వరంగా మారిందని సీజేఐ తెలిపారు. దీని లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయన్నారు.

ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ అంటూ సీజేఐ ఎన్వీ రమణ..

ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ అంటూ సీజేఐ ఎన్వీ రమణ..

ప్రజలు తొందరగా కోలుకుంటున్నారని, అందువల్ల, సుప్రీంకోర్టులో పూర్తి స్థాయి భౌతిక విచారణలను పునరుద్ధరించాలని కోరుతున్నా అని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ సీజేఐని అభ్యర్థించారు. దీనికి సీజేఐ స్పందించారు. తనకు ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని, నాలుగు రోజుల్లోనే తగ్గిందని చెప్పారు. అయితే, తనపై ఇంకా దాని ప్రభావం ఉందని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ సైలెంట్ కిల్లర్ లాంటిదన్నారు సీజేఐ ఎన్వీ రమణ.

Recommended Video

    Justice N V Ramana To Be Next CJI, Gets Presidential Assent For His Appointment
    25 రోజులైనా కోలుకోవడం లేదంటూ సీజేఐ ఎన్వీ రమణ

    25 రోజులైనా కోలుకోవడం లేదంటూ సీజేఐ ఎన్వీ రమణ


    నేను కరోనా తొలి వేవ్‌లో వైరస్ బారినపడి త్వరగా కోలుకున్నా.. కానీ, ఇప్పుడు ఈ వేవ్‌లో తనకు ఒమిక్రాన్ సోకి 25 రోజులు గడుస్తున్నా.. ఇంకా వైరస్ అనంతర ప్రభావాలతో ఇబ్బంది పడుతున్నట్లు సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, బుధవారం కూడా 15వేలకు పైనే కొత్త వెలుగుచూశాయని సీజేఐ తెలిపారు. అయితే, కరోనా వైరస్ పరిస్థితి సమీక్షించి, పూర్తిస్థాయి భౌతిక విచారణలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఎన్వీ రమణ తెలిపారు. కాగా, దేశంలో కరోనా కేసులు తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు సడలించాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+