Covishield booster dose: ఒమిక్రాన్ విజృంభిస్తోన్న వేళ..: అనుమతిపై కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో తిష్ఠ వేసింది. ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుదల బాట పట్టింది. ఇప్పటికే 25కు పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలల్లో ఈ కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వాటి సంఖ్య పెరగదనడానికి ఎలాంటి గ్యారంటీ ఉండట్లేదు. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త కరోనా వైరస్ వేరియంట్ ప్రపంచ దేశాలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.

బూస్టర్ డోస్..
ఈ పరిస్థితుల మధ్య దేశంలో కొనసాగుతోన్న కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొత్తగా బూస్టర్ డోస్ (Booster dose)ను అందుబాటులోకి తీసుకుని రావడానికి కసరత్తు చేస్తోంది. దీనితో పాటు అదనపు డోస్ వ్యాక్సిన్‌ను కూడా ఇవ్వాలని భావిస్తోంది. దీనిపై ఇవ్వాళ కీలక నిర్ణయాన్ని తీసుకోనుంది. అదనంగా మరో డోస్ వ్యాక్సిన్‌పైనా ఓ స్పష్టతను ఇవ్వనుంది కేంద్రం.

సబ్జెక్ట్ టు ఎక్స్‌పర్ట్ కమిటీ భేటీలో..
ఈ మధ్యాహ్నం 12 గంటలకు దేశ రాజధానిలో సబ్జెక్ట్ టు ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) భేటీ కానుంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) ఆధీనంలో ఉన్న కమిటీ ఇది. బూస్టర్ డోస్‌లపై నిర్ణయం తీసుకోవడానికి ఎస్ఈసీ సమావేశం కావడం ఇదే తొలిసారి. బూస్టర్ డోస్‌ను అందుబాటులోకి తీసుకుని రావడం, దానికి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయడం, ప్రాధాన్యత క్రమాన్ని నిర్ధారించడం వంటి అంశాలపై ఈ ప్యానెల్ కమిటీ చర్చిస్తుంది. బూస్టర్ డోస్‌లపై ఇదివరకే ఇమ్యునైజేషన్ ప్యానెల్ చేసిన సిఫారసులను ఈ భేటీ సందర్భంగా పరిగణనలోకి తీసుకుంటుంది.

కోవిషీల్డ్ బూస్టర్ డోస్..
మహారాష్ట్రలోని పుణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ బూస్టర్ డోస్‌ను తయారు చేస్తోంది. కోవిషీల్డ్ బూస్టర్ డోస్ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది. దీనికి అవసరమైన అనుమతులను మంజూరు చేయాలంటూ కొద్దిరోజుల కిందటే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యం డ్రగ్ కంట్రోలర్ జనరల్‌కు ప్రతిపాదనలను పంపించింది. చాలినన్ని కోవిషీల్డ్ డోసులు నిల్వ ఉన్నాయని, బూస్టర్ డోస్ తయారీపై దృష్టి సారించామని సీరమ్ పేర్కొంది. దేశంలో బూస్టర్ డోస్ అనుమతుల కోసం ప్రతిపాదనలను పంపించిన మొట్టమొదటి సంస్థ ఇదే.
Recommended Video

ప్రాధాన్యత క్రమం మారే ఛాన్స్
దేశంలో 18 ఏళ్ల లోపు వయస్సున్న వారికి ఇంకా వ్యాక్సిన్ అందాల్సి ఉంది. ఈ కేటగిరీకి చెందిన వారికి ఎప్పుడు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందనే విషయంపై ఇదివరకే నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ప్యానెల్ కమిటీ చర్చించింది. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రాకపోయి ఉంటే 2 నుంచి 18 సంవత్సరా లోపు వయస్సు ఉన్న వారికి వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ మరింత ఊపందుకుని ఉండేది. ఈ కొత్త వేరియంట్ భారత్‌లో ఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యత క్రమం పూర్తిగా మారిపోయే పరిస్థితి నెలకొంది. వీటన్నింటిపైనా సమగ్రమైన విధానాన్ని రూపొందించే విషయంపై ఈ ప్యానెల్ కమిటీ చర్చించింది.












Click it and Unblock the Notifications