న్యూ ఇయర్: భార్య రబ్రీదేవికి గులాబీ, సీఎంకు సలహా ఇచ్చిన లాలూ
పాట్నా: ఢిల్లీలో గుండె ఆపరేషన్ చేయించుకున్న నాలుగు నెలల తర్వాత రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం పాట్నాకి వచ్చారు. నూతన సంవత్సరాన్ని ఆయన నివాసంలో జరుపుకున్న ఆయన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, లాలూ భార్య రబ్రీదేవికి గులాబీ పువ్వు ఇచ్చారు.
లాలూ భార్య రబ్రీకి గులాబీ పువ్వు ఇచ్చే సమయంలో ఫోటో తీసేందుకు కెమెరాలు పోటీ పడ్డాయి. అనంతరం మీడియాతో లాలూ మాట్లాడుతూ "ప్రస్తుతం ప్రజలు ఆంగ్ల కాలెండర్లను అనుసరిస్తున్నారు. అందుకే పాట్నాలో కూడా ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదనుకున్నా" అని అన్నారు.

2015వ సంవత్సరం బీహారీ రాజకీయాల్లో ఎంతో కీలకం అని అన్నారు. ఈ ఏడాది చివర్లో బీహార్‌లో ఎన్నికలు రానున్నాయి. బీహార్‌లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా లాలూ ప్రసాద్ యాదవ్‌కి చెందిన ఆర్జేడీ, జనతా దళ్ (యునైటెడ్) సంయుక్తంగా పోటీ చేయనుండటం విశేషం.
లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారు సహాయం లేకుండా సమాజంలో ద్వేషం పెంచుతున్నా వారిని అదుపు చేయడం చాలా కష్టమంని బీహార్ సీఎం మాంఝీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు లౌకికవాదం వాటాను పెంచేందుకు చాలా ముఖ్యమని లాలూ చెప్పారు.












Click it and Unblock the Notifications