న్యూఇయర్ రోజు పక్కరాష్ట్రం బార్డర్ లో ఏం చేశారంటే ?, అర్దరాత్రి అవసరమా !

భారతదేశం మొత్తం జాతీయజెండాను గౌరవిస్తారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాలు రాష్ట్రీయ జెండాను కూడా చాలా గౌరవిస్తారు. ముఖ్యంగా రాష్ట్రా జెండాకు కాని, రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యక్తుల విగ్రహాలు, రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలు, దేశ భక్తుల విగ్రహాలు, కుల సంఘాల నాయకుల విగ్రహాలకు హాని జరిగితే స్థానిక ప్రజలు ఆవేశంతో ఊగిపోయే విషయాలు మనం ఏన్నో సందర్బాల్లో చూశాము.

కర్ణాటకలో కన్నడ జెండాకు చాలా ప్రత్యేకత ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కన్నడిగులు ఆ రాష్ట్ర జెండాను ఎంతో గైరవిస్తారు. బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలోని అనేక నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం ఎరుపు, పసుపు రంగులతో ఉండే కర్ణాటక జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. అలాంటి కర్ణాటక రాష్ట్రానికి గుర్తుంగా ఉండే జెండాకు, నూతన సంవత్సర వేడుకులు జరిగే కొన్ని గంటల ముందు నిప్పంటించడం కలకలం రేపింది.

On New Years Day, the flag of Karnataka was set on fire at the border of the neighboring state

కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులోని బెళగావి జిల్లాలో ఇప్పటికీ కన్నడిగులు, మరాఠీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైయ్యింది. బెళగావి జిల్లా మాదే అంటే కాదు మాదే అని కర్ణాటక- మహారాష్ట్ర ప్రభుత్వాలు, రెండు బెళగావి జిల్లాలోని వందలాది గ్రామాల్లోని ప్రజలు నిత్యం పోట్లాడుకుంటున్నారు. బెళగావి జిల్లాలో పోటాపోటీగా కన్నడ జెండాలు, ఎంఇస్ జెండాలు ఏర్పాటు చేస్తున్నారు.

బెళగావి సమీపంలోని సుళగా గ్రామంలోని కన్నడ పోరాట వీరుడు సంగోళి రాయన్న విగ్రహం పక్కనే ఏర్పాటు చేసిన కర్ణాటక ధ్వజానికి ఆదివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి ఆ జెండాను కాల్చి బూడిద చేశారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి ఆదివారం అర్దరాత్రి సొంగళి రాయన్న విగ్రహం దగ్గరకు వెళ్లిన కన్నడిగులు కర్ణాటక జెండా కాలి బూడిద అయిన విషయం గుర్తించి ఆందోళనకు దిగారు.

On New Years Day, the flag of Karnataka was set on fire at the border of the neighboring state

బెళగావిలో ఆదివారం అర్దరాత్రి ఉద్రిక్తపరిస్థితులు నెలకొనడంతో ప్రజలు హడలిపోయారు. ఒకవైపు కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా కార్పోరేట్ కంపెనీలు, మాల్స్, షాపులు, సంస్థల వాటి పేర్లను కన్నడ బాషలో రాయడానికి అందరూ ఆమోదించాలని కన్నడ అనుకూల సంస్థలు, సంఘాలు ఆందోళన చేస్తూ పోరాటం సాగిస్తున్నాయి. ఇదే విషయంలో రెండు వారాల నుంచి బెంగళూరులో ఆందోళనలు జరుగుతున్నాయి.

కన్నడ నామఫలకాల విషయంలో కర్ణాటక రక్షణా వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడతోపాటు పలువురు కన్నడ ఉద్యమకారులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపించారు. అలాంటి తరుణంలో కొత్త ఏడాది తొలిరోజే బెళగావిలో కన్నడ జెండాకు నిప్పంటించడంతో మండుతున్న అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కరవే కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. కన్నడ అనుకూల సంఘాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని, లేదంటే మేం కూడా అదే పని చేస్తామని కరవే నాయకులు, కార్యకర్తలు కర్ణాటక ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఘటనపై బెళగావిలోని కాకతి పోలీస్‌స్టేషన్‌ లో కేసు నమోదు అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+