క్యాబ్ డ్రైవర్ రేప్: బ్యాన్ చేయడం పరిష్కారం కాదన్న గడ్కరీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇంటర్నెట్ సంబంధిత టాక్సీ సర్వీసులను నిషేధించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్ని రాష్ట్రాలకు మంగళవారం లేఖలు రాశారు. అయితే, సర్వీసులను నిషేధించడం సమస్యకు పరిష్కారం కాదని రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
ఢిల్లీ ప్రభుత్వం వెబ్ సంబంధిత టాక్సీ సర్వీసులను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఉబేర్ ఆపరేషన్లను ప్రభుత్వం నిషేధించింది. మరో 20 క్యాబ్ సర్వీసులను బ్లాక్ లిస్టులో పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వేలాది మంది డ్రైవర్లు ఉపాధి కోల్పోయి వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. వెబ్ సంబంధిత ఆప్స్ ప్రాతిపదికపై నడిచే క్యాబ్స్ రాష్ట్ర రవాణా సంస్థలో నమోదు చేసుకోనట్లు తెలుస్తోంది.

శుక్రవారం రాత్రి ఢిల్లీలో 27ఏళ్ల మహిళ క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా డ్రైవర్ మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ నుంచి ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్‌లో గల తన ఇంటికి తిరిగి వెళ్తుండగా రాత్రి జరిగింది. గుర్గావ్‌కు చెందిన గ్లోబల్ టాక్స్ అండ్ అడ్వయిజరీ సర్వీస్ కన్సల్టెంట్స్‌లో పనిచేస్తోంది.
మొబైల్ ఆప్ ద్వారా ఆమె ఇంటికి తిరిగి వెళ్లడానికి స్విఫ్ట్ డిజైర్‌ను బుక్ చేసుకుంది. ఆ స్విఫ్ట్ కారులోనే దారుణం చోటు చేసుకుంది. తనపై ఎక్కడ అత్యాచారం జరిగిందీ ఆమె గుర్తించే స్థితిలో లేదు. మిత్రులతో డ్రింక్స్ తాగడం వల్ల, తనపై దాడి జరిగిన దిగ్భ్రమ నుంచి తేరుకోనందు వల్ల ఆమె స్థలాన్ని గుర్తించలేకపోతున్నట్లు చెబుతున్నారు. కారులో కూర్చుని వెనక్కి ఒరిగి కూర్చుంది. నిద్రమత్తులో కూడా ఉంది.
ఈ స్థితిలో కారును నిర్మానుష్యమైన ప్రదేశంలో డ్రైవర్ ఆపాడు. అది గమనించి దిగడానికి ప్రయత్నించింది. అయితే, డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. ఆమె కేకలు వేసింది. కానీ డ్రైవర్ ఆమెను వెనక్కి తోసి అత్యాచారం జరిపాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications