వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష ఈవీఎంలు మిస్ అయ్యాయి...! ఈవీఎం ఓటింగ్... ప్రజా తీర్పు కాదు... మమతా బెనర్జీ

|
Google Oneindia TeluguNews

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంల టాంపరింగ్ చేసీ గెలిచిందని త‌ృణముల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిబెంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈనేపథ్యంలోనే ఈవీఎంల వచ్చిన ఫలితాలు ప్రజా తీర్పు కాదని ఆమే పేర్కోన్నారు. మరోవైపు తమకు బ్యాలెట్ పేపర్ల ద్వారనే ఎన్నికలు నిర్వహించాలని ,ఈవీఎంల ద్వార ఓటింగ్ నిర్వహంచాలని తాము కోరుకోవడం లేదని ఆమే స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే బ్యాలెట్ పేపర్ ద్వార ఓటింగ్ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆమే డిమాండ్ చేశారు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్నికల ఫలితాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈనేపథ్యంలోనే బీజేపీపై మరోసారి ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారాన్ని, డబ్బులను ఉపయోగించి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని విమర్శలు చేశారు. దీంతో తాము ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నామని, బ్యాలెట్ పేపర్ల ద్వార ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.కాగా ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని అన్నారు. మరోవైపు అభివృద్ది చెందిన అమేరికా సైతం బ్యాలెట్ పేపర్ ద్వారనే ఓటింగ్ నిర్వహిస్తుందని అన్నారు.

One lakh machines are missing. EVM voting is not the verdict of people

మొత్తం ఈవీఎంలలో 2శాతం ఈవీఎంలు మాత్రమే సరిచూశారని 98 శాతం ఈవీఎంలు వెరిఫై చేయలేదని అన్నారు.కాగా లక్ష ఈవీఎం లు మిస్ అయ్యాయని,ఈనేపథ్యంలోనే ఈవీఎంల ద్వార వచ్చిన తీర్పు ప్రజా తీర్పు కాదని అన్నారు. కాగా ఈవీఎంలపై దేశంలోని 21 ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంలపై సుప్రిం కోర్టుకు సైతం వెళ్లారు. దీంతో సుప్రిం కోర్టు కూడ ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలను రీ పిటీషన్ స్వీకరించేందుకు నిరాకరించింది.

English summary
west Bengal Chief Minister Mamata Banerjee launched yet another frontal attack on the BJP accusing it of using money power and resorting to tampering of electronic voting machines (EVMs) to win the recent Lok Sabha election held over seven phases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X