స్వామీజీ రాసలీలల వివాదం: మఠం ఖాళీ చెయ్యాలని వార్నింగ్, నెల రోజులు, ఝలక్!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటకలోని గంగావతిలో ఉన్న కల్లు మఠం కట్టూరు స్వామీజీ రాసలీలల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు మఠం ఖాళీ చెయ్యాలని వార్నింగ్ ఇవ్వడంతో కట్టూరు స్వామీజీ ఒక నెల రోజుల పాటు మౌనవ్రతం చెయ్యడం ప్రారంభించి ప్రత్యర్థులకు ఝలక్ ఇచ్చారు.

కల్లు మఠం కట్టూరు స్వామీజీ మీద రాసలీలల ఆరోపణలు వచ్చాయి. వీరశైవ లింగాయత్ సమాజానికి చెందిన ప్రముఖులు కోట్టూరు స్వామీజీని మఠం వదిలి వెళ్లిపోవాలని సూచించారు. మఠం వదిలి పెట్టడానికి జనవరి 5వ తేదీ వరకు గడుపు ఇచ్చారు.

One month silence vratha from Kottur Swamiji near Gangavathi in Karnataka.

అయితే వీరశైవ లింగాయిత్ సమాజం నాయకులు ఆదేశాలును కట్టూరు స్వామీజీ లెక్కచెయ్యలేదు. ఎలాంటి పరిస్థితుల్లో తాను మఠం వదిలిపెట్టనని కట్టూరు స్వామీజీ తేల్చి చెప్పారు. ఈ సందర్బంలో వీరశైవ లింగాయత్ సమాజం నాయకులు స్వామీజీకి మరో అవకాశం ఇచ్చారు.

జనవరి 22వ తేదీలోపు మఠం ఖాళీ చెయ్యాలని, లేదంటే గంగావతి పట్టణంలో కట్టూరు స్వామీజీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి ఆందోళనకు దిగుతామని వీరశైవ లింగాయిత్ సమాజం నాయకులు హెచ్చరించారు. ఈ సందర్బంలో కట్టూరు స్వామీజీ ఒక నెల రోజులు మౌనవ్రతం దీక్ష చేస్తున్నారని చెప్పిన భక్తులు మరో సారి ఆ వర్గం నాయకులకు ఝలక్ ఇచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
One month silence vratha from Kottur Swamiji near Gangavathi in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి