అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు- ముందడుగు
One Nation One Election: దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొంది. రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోన్నాయి. ఎన్నికల రణక్షేత్రంలో దిగడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోన్నాయి. బహిరంగ సభలను నిర్వహిస్తూ వస్తోన్నాయి.
ఈ పరిస్థితుల్లో- రాజకీయంగా ఉత్కంఠతను రేకెత్తిస్తోన్న వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై కీలక ముందడుగు పడింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి గల సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ.. తన నివేదికకు తుదిమెరుగులు దిద్దుతోంది.

వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కోవింద్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తొోన్న ఈ కమిటీలో మద్రాస్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సంజీబ్ బెనర్జీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, రాజ్యసభ మాజీ సభ్యుడు గులాంనబీ ఆజాద్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ సీ కశ్యప్, మాజీ సీవీసీ సంజయ్ కొఠారి, సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ నాలుగోసారి సమావేశమైంది. ఇప్పటివరకు జరిగిన మూడు భేటీల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల కమిషన్ మాజీ అధికారులను కలిసింది. వారి నుంచి లిఖితపూరకంగా అభిప్రాయాలను సేకరించింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను అమలు వల్ల కలిగే ప్రయోజనాలు లేదా ఇబ్బందికర పరిణామాలపై చర్చించింది.

తాజాగా- సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్‌తో సమావేశమైందీ కమిటీ. ఈ కాన్సెప్ట్‌ను అమలు చేయడానికి గల న్యాయపరమైన ఇబ్బందులు, ఇతర చిక్కులపై చర్చించింది. ఈ భేటీ ముగిసిన అనంతరం గోవాకు చెందిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ అధినేత దీపక్ పాండురంగ్ ధవళికర్.. ఈ కమిటీని కలిశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై సానుకూలతను వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications