కశ్మీర్ కాల్పులు... ఇద్దరు పాక్ ,మరోకరు భారత ఆర్మీ జవాన్ల మృతి...
పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘలకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట ఉన్న మూడు ప్రాంతాల్లో కాల్పులు జరిపారు. దీంతో ఇండియన్ జవాన్ మృత్యువాత పడగా మరో ఇద్దరు పాకిస్థాన్ జవానులు సైతం మృతి చెందారు. కాగా రెండు సోమవారం ఉదయం కూడ కాల్పులు జరపడంతో భారత్ చెందిన ఓ చిన్నారీ సైతం మృత్యువాత పడింది.

చాల రోజుల తర్వాత జమ్ము కశ్మీర్‌లో పాకిస్థాన్ సైన్యం మరోసారి రెచ్చిపోయింద. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట ఉన్న గ్రామాల్లోని తంద్‌గిరి,ఫార్కిన్, సుందర్‌గిరి ప్రాంతాల్లో కాల్పులకు దిగారు. దీంతో అప్రత్తమైన భద్రత దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. కాగా ఈ కాల్పుల్లో ఇద్దరు పాకిస్థాన్ జవానులు చనిపోగా, భారత ఆర్మీ జవాన్ కూడ కాల్పుల్లో చనిపోయారు. కాగా ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications