బస్సులో సీటు కోసం కొట్టుకున్న ఇద్దరు విద్యార్ధులు.. ఒకరు మృతి.. ఎక్కడంటే ?

స్కూల్ బస్సులో సీటు కోసం జరిగిన గోడవలో ఓ విద్యార్థి మృతి చెందడం సర్వత్రా కలకలంగా మారింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటు చేసుకుంది. ఎడప్పాడిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వెల్లాండివలసు ప్రాంతానికి చెందిన కందగురు 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం నాడు ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు విద్యార్థుల మధ్య పాఠశాల బస్సులో సీటు విషయమై గొడవ జరిగింది. కందగురు, మరో విద్యార్ధికి మధ్య గొడవ జరిగినట్టు చెబుతున్నారు. ఈ ఘర్షణలో మరో విద్యార్ధి ఛాతిపై కొట్టడంతో కిందపడిపోయాడు. ఆ క్రమంలోనే తల వెనుక కూడా తీవ్ర గాయమైనట్టు తెలుస్తోంది. దాంతో వెంటనే సమాచారం మేరకు కుమారుడిని తీసుకొని సెల్వం ఎడప్పాడిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి బాలుడుని తీసుకొని వెళ్ళాడు.

one student died in fight for seat in school bus Where

ప్రథమ చికిత్స అందించిన కందగురును మెరుగైన వైద్యం కోసం సేలంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కందగురు మంగళవారం ఉదయం మృతి చెందాడు. అతని తల వెనుక భాగం బస్సు నేలకు బలంగా తాకిందని.. ఆ సమయంలోనే గుండె, మెదడుకు వరుసగా రెండు షాక్‌లు జరగడంతో పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు వెల్లడించారు.

ఇక కందగురు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎడప్పాడి పోలీసులు మరో బాలుడిపై కేసు నమోదు చేసి ప్రభుత్వ దిద్దుబాటు గృహానికి తరలించారు. అలానే ప్రైవేట్ పాఠశాల వద్ద భద్రత కోసం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+