ఈవీఎం మిషన్లు... ప్లస్.. ఉల్లిగడ్డలు...జర పైలం

ఎండలు ఎంత విపరీతంగా దంచుతున్నాయో అందరికి తెలుసు..రాష్ట్ర్రంలో సగటున 45 డిగ్రీల ఉష్షోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు రోడ్డు మీదకు వెళ్లాలంటే జంకుతున్నారు. మరి అత్యసవసరమైతేనే తప్ప బయటికి వెళుతున్న పరిస్థితి..దీంతో పాటు ఎండదెబ్బ తాకకుండా,ఎండకు నీరసపడిపోకుండా సరైన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈనేపథ్యంలోనే వారివెంట గోడుగులు, వాటర్ బాటిళ్లతోపాటు ఇతర అవసరమైన వస్తువులు తీసుకెళుతున్నారు. అయితే సాధరణ ప్రజల్లగే పోలింగ్ సిబ్బందికి కూడ ఎండనుండి ఉపశమనం పోందేందుకు పోలింగ్ మిషనరీతోపాటు ఉల్లిగడ్డలను పంపిణి చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన చెందిన జిల్లా కలేక్టర్ ,కాగా అధికారులు పోలింగ్ సిబ్బందికి దగ్గరుండి వాటిని అందిస్తున్నారు.

Onions distributed to polling parties in Jhabua,madhya pradesh

భానుడు భగభగలు రేపటి ఎన్నికలపై ప్రభావం చూపించకుండా ఉండేందుకు మధ్యప్రదేశ్‌లో ఎన్నికల విధులు నిర్వహించే వారు ఎండ భారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు అక్కడి జిల్లా అధికారులు.ఆదివారం పోలింగ్ విధుల్లో పాల్గోనున్న సిబ్బందికి పోలీంగ్ మిషనరీతోపాటు వారికి సేఫ్టీ కోసం ఉల్లిగడ్డలు పంపిణి చేస్తున్నారు. పోలీంగ్ అధికారులు సాధరణంగా ఒక్కసారి పోలింగ్ బూత్‌లోకి పోయిందంటే తిరిగి ఎన్నికలు అయిపోయి ఈవీఎంలను జాగ్రత్తగా తీసుకెళ్లెవరకు వాళ్లకు టెన్షన్ ఉంటుంది. దీంతో ఎండ నుండి కాపాడుకునేందుకు ఉడుతా భక్తిగా ఉల్లిగడ్డలు పంపిణి చేశారు. ఉల్లిగడ్డలు వేడిని తగ్గించి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో, వీటిని స్థానికుల సహకారంతో పోలింగ్ సిబ్బందికి పంపిణి చేస్తున్నారు.

సో మొత్తం మీద ఏడు దశలుగా కొనసాగుతున్న ఎన్నికలు ఆదివారంతో ముగియనుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్ర్రాల్లో 59 లోక్‌సభ నియోజవర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం అవుతుండగా మొత్తం 900 కు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+