బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Online order: కోరియర్ షాపులో పేలిపోయిన మిక్సీ, ఆ లేడీ ఎందుకు రిటన్ ఇచ్చింది ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హాసన్: కోరియర్ వ్యాపారం చేస్తున్న యువకుడికి ఊహించిన సంఘటన ఎదురైయ్యింది. మూడు రోజుల క్రితం కర్ణాటకలోని హాసన్‌ నగరంలోని కోరియర్ షాపులో మిక్సీ పేలిపోయింది. ఈఘటనలో గాయపడిన కొరియర్ షాపు యజమాని శశి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని చేతికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. దీనికి శస్త్రచికిత్స చెయ్యడంతో ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

శశి భార్య నిన్న (మంగళవారం) కవలలకు జన్మనిచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్య, పిల్లలు కనీసం చూడలేని పరిస్థితి తనకు ఎదురైయ్యిందని కోరియర్ షాపు యజమాని శశి విలపిస్తున్నాడు. హసన్ నగర్‌లోని ఓ కొరియర్ షాపులో డిసెంబర్ 26న మిక్సీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అదే కోరియర్ షాప్ యజమాని శశికి తీవ్రగాయాలైనాయి.

girlfriend: ఒంటరిగా ఉండలేకపోతున్నా, నీ భార్యను నాతో పంపించు అని భర్తకు చెప్పిన ప్రియుడు !girlfriend: ఒంటరిగా ఉండలేకపోతున్నా, నీ భార్యను నాతో పంపించు అని భర్తకు చెప్పిన ప్రియుడు !

 Online order mixi exploded in courier shop in Hassan city in Karnataka. Owner injured.

ఈ సంఘటన గురించి బుధవారం శశి మీడియాతో మాట్లాడుతూ పూర్తి వివరాలు చెప్పాడు. అడ్రస్ లేకుండానే బెంగళూరులోని పీణ్యా నుంచి తన షాపుకు ఓ కొరియర్ వచ్చిందని శశి అన్నాడు. పార్శిల్‌ని తెరిచి చూద్దాము అనుకున్నానని, అప్పటికే ఇంటికి బయలుదేరిన నేను ఆ మిక్సీ ఉన్న పార్శిల్ ను టేబుల్ మీద పెట్టానని శశి చెప్పాడు.

షాప్ తలుపు వేసుకుని ఇంటికి వెళ్లాలనుకుంటున్న సమయంలో టేబుల్ మీద ఉన్న మిక్సీ పైనుంచి కిందపడి పేలిపోయిందని శశి వివరించారు. ఇప్పుడు తనకు కవలపిల్లలు పుట్టినా చూడలేని పరిస్థితి ఎదురైయ్యిందని, ఎవరో చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవిస్తున్నానని శశి విచారం వ్యక్తం చేశాడు.

Lady SI: భర్తను చంపాలని రూ. 10 లక్షలు ఇచ్చిన లేడీ ఎస్ఐ, కారు డ్రైవర్ తో మేడమ్ ?, దృశ్యం సినిమా !Lady SI: భర్తను చంపాలని రూ. 10 లక్షలు ఇచ్చిన లేడీ ఎస్ఐ, కారు డ్రైవర్ తో మేడమ్ ?, దృశ్యం సినిమా !

డిసెంబర్ 17వ తేదీన ఇలాగే ఓ కొరిమర్ వచ్చిందని శశి గుర్తు చేశాడు. ఆ కోరియర్ వసంత అనే మహిళ ఇంటికి డెలివరీ చేయబడింది. అయితే వసంత అనే మహిళ 26వ తేదీ సాయంత్రం వచ్చి ఈ కోరియర్ నాదికాదని, దీనిమీద నా అడ్రస్ లేదని చెప్పి వపస్ పంపించాలని చెప్పింది. కొరియర్ తిరిగి పంపేందుకు 300 రూపాయలు రిటర్న్ చార్జీ తను అడిగానని శశి వివరించాడు.

వసంత అనే మహిళ రిటర్ చార్జ్ ఇవ్వకుండా మిక్సీని ఇక్కడే వదిలేసి వెళ్లిపోయిందని, తరువాత కొంతసేపటికే అది పేలిపోయిందని శశి విచారం వ్యక్తం చేశాడు. కొంచెం తారుమారు అయివుంటే నా ప్రాణానికే ముప్పు వచ్చేదని, ఇప్పుడు నాజీవితం నాశనం అయ్యిందని శశి విచారం వ్యక్తం చేశారు. తీవ్రగాయాలైన శశి ఒక ఆసుపత్రిలో, మరో ఆసుపత్రిలో అతని భార్య చికిత్స పొందుతున్నారు.

English summary
Online order mixi exploded in courier shop in Hassan city in Karnataka. Owner injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X