వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపరేషన్ లేకుంటే ఈ బాబు బతకడు, ఖర్చు పెట్టే స్థోమత లేక తండ్రి గుండె విలవిల

Google Oneindia TeluguNews

"మేము అన్ని రకాలుగా ప్రయత్నించాం. అందరినీ అడుక్కున్నాం. ప్రార్థించాం. అయినా ఫలితం లేదు. మా అబ్బాయిని ఎలాగైనా కాపాడుకోవాలని అష్టకష్టాలు పడ్డాం. పడుతున్నాం కూడా. మేము చేయగలిగింది మేము చేసి విధికే వదిలేస్తున్నాం. ఇక అంతకన్నా ఏం చేయగలం." అంటూ తన ఆవేదన వెల్లడించాడు కృతిక్ తండ్రి అంకుర్.

ఆ చిన్నారి ఎనిమిది నెలలుగా జబ్బుతో బాధపడుతున్నాడు. కానీ రెండేళ్ల వయస్సున్న కృతిక్ కి అది చాలా ఎక్కువ కాలం. ఆ బిడ్డ భూమిపైకి వచ్చినప్పటి నుంచి కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. తనకి తెలిసిన జీవితం అదే మరి. పగలూ రాత్రి ఏడుస్తాడు. తన అసౌకర్యాన్ని, నొప్పిని, బాధని ఇంకేరకంగా చెప్పలేక ఏడుస్తూ బాధపడే వయస్సు అతనది. అతని చర్మం, కళ్లు మొత్తం డల్ గా మారిపోయాయి. ఆ చిన్నారి అందమైన పాల బుగ్గలు లోపలికి పీక్కుపోయాయి. పుట్టినప్పుడు బోసినవ్వులతో మురిపించిన ఈ బాబు తన అందాన్ని మొత్తం కొన్ని నెలల క్రితమే కోల్పోయాడు.

This boy cannt live without surgery

కొన్ని నెలల క్రితం కృతిక్ రోజూ అదే పనిగా చాలాసేపు ఏడ్చేవాడు. మొదట ఇంట్లో అమ్మనాన్న ఆ ఏడుపు మామూలే అనుకున్నారు. కానీ తన కొడుకు ఏడుపు తండ్రి అంకుర్ సహజంగా అన్పించలేదు. తన కుమారుడు ఏదో తెలియని బాధ అనుభవిస్తున్నాడని అంకుర్ భావించాడు.

తర్వాత కృతిక్ ఆరోగ్యపరిస్థితిని లూథియానా, ఢిల్లీలోని చాలా హాస్పిటల్స్ లో చూపించాడు. కానీ డాక్టర్లంతా "సీరియస్ విషయం ఏదీ లేదన్నారు". అయినా కృతిక్ ఏడుపుమాత్రం ఆగలేదు. చివరకు ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్ వారు కృతిక్ గుండె.. మిగతా శరీరానికి తగినంత శుభ్రమైన రక్తాన్ని పంపిణీ చేయలేకపోతోందని తెలిపారు. ఇది ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. అంకుర్ గుండె ఆగిపోయినంత పని అయ్యింది. తన ముద్దుల కొడుకు అంత బాధతో అల్లాడుతున్నాడా అని బాధపడ్డాడు.

This boy cannt live without surgery

గుండెకి ఆపరేషన్ చేస్తేనే కృతిక్ బతుకుతాడు. కానీ అంతటితో విషయం అయిపోలేదు. "ఒక ఆరోగ్యవంతమైన 2 ఏళ్ళ బాబు బరువు 10కిలోలు ఉండాలి. కానీ కృతిక్ 6కేజీలు ఉన్నాడు. అతని గుండె సరిగా పనిచేయటం లేదు, మేము చేయగలిగిందల్లా దూరం నుంచి నిస్సహాయంగా చూడటమే." అంటూ అంకుర్ బాధపడుతున్నాడు.

This boy cannt live without surgery

డాక్టర్లు కృతిక్ ఇలాంటి సీరియస్ ఆపరేషన్ కి తట్టుకునేంత బరువు లేడని అన్నారు. ఈ ఆపరేషన్ కి తయారవ్వాలంటే అంకుర్ తన బిడ్డకి సరిపడినంత పోషకాహారం, మందులు ఇచ్చి తగినంత బరువు పెరిగేలా చేయాలి. గుండె ఆపరేషన్ తో పాటు,ఇదంతా కలిపి 5లక్షల రూపాయల ఖర్చు అవుతుంది.

అంకుర్ పంజాబ్ లోని జలంధర్ లో గ్యాస్ సిలిండర్లు పెట్టి, రిపేర్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. అతని ఆదాయం కుటుంబ అవసరాలకు కూడా సరిపోదు. ఇప్పటికే కృతిక్ టెస్టుల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను ఆశ్రయించాడు. వారి ఆర్థిక సాయంతో పెద్ద మొత్తాన్నే ఖర్చు చేశాడు. వారు కూడా అంతంత మాత్రంగానే సంపాదిస్తారు.

This boy cannt live without surgery

"నా భార్య, మా అబ్బాయి కృతిక్ ఇద్దరూ నా ప్రపంచం. వారిలో ఎవరినీ నేనే కోల్పోలేను. నా కుమారుడి పరిస్థితి నన్ను రోజురోజుకు కృంగదీస్తుంది. " అంటూ అంకుర్ తన బాధ చెప్పుకున్నాడు.

దయ ఉన్న మహానుభావులు చేసే చిన్న విరాళం కృతిక్ అవసరమయ్యే మందులకు, పోషకాహారానికి అలాగే తప్పనిసరిగా చేయాల్సిన ఆపరేషన్ కి అయ్యే ఖర్చుల్లో పెద్ద పాత్రను పోషిస్తుంది. అతనికి బీమా లేదు కాబట్టి ఎవరూ అతనికి లోను ఇవ్వరు. కేవలం మీ సాయమే కృతిక్ ను కాపాడుకునేలా చేయగలదు.

This boy cannt live without surgery

ఈ దీనగాథను మీరు ఫేస్ బుక్, వాట్స్ యాప్ లలో ఇతరులతో పంచుకుని ( షేర్ చేసి) కూడా కృతిక్ కు సాయపడవచ్చు. దయ ఉంచి కృతిక్ ప్రాణాలను కాపాడడానికి మీ వంతు సాయం చేయండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X