దోచుకున్నవారికే సీబీఐ అంటే భయం...చంద్రబాబుపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన జైట్లీ
భోపాల్ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేదా సీబీఐకి కేసుల విచారణకు అనుమతి నిరాకరించిన ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఎవరైతే అతిగా దోచుకుని దాచుకున్నారో అలాంటి వారే సీబీఐ అంటే భయపడతారని వ్యాఖ్యానించారు. మధ్య ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఆరాష్ట్ర మేనిఫెస్టో విడుదలైన సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడారు.
ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అలాంటి వారే తమ రాష్ట్రంలో సీబీఐ విచారణ జరపరాదంటూ అనుమతులు నిరాకరిస్తున్నారని జైట్లీ చెప్పారు. అవినీతికి పాల్పడే ఏ రాష్ట్రమైనా సరే విడిచిపెట్టేది లేదని జైట్లీ స్పష్టం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ కేసులను విచారణ చేసేందుకు అనుమతి ఎందుకు నిరాకరిస్తున్నారో తెలియదన్న జైట్లీ... కేవలం సొంత మనుషులపై సీబీఐ విచారణ ఎక్కడ జరుగుతుందనే భయంతోనే చంద్రబాబు రహస్య జీవో జారీ చేశారని జైట్లీ తెలిపారు. ఏపీలో ఇప్పటి వరకు ఏకేసును సీబీఐకి అప్పగించలేదన్న జైట్లీ చంద్రబాబు ముందస్తు చర్యల్లో భాగంగానే భయపడి అనుమతి నిరాకరించారని జైట్లీ చెప్పారు. ఇక ఇంతకంటే తానేమి చెప్పలేనని అందరికీ ఈపాటికే అర్థం అయి ఉంటుందని జైట్లీ అన్నారు.

భారత దేశంలో ఒక ఫెడరల్ వ్యవస్థ ఉందని దీనికిందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబధించిన కేసులు విచారణ చేసేందుకు సీబీఐ ఏర్పాటు అయ్యిందని జైట్లీ చెప్పారు. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో భారీ కుంభకోణాలు, అవినీతి కేసులు విచారణ చేయాల్సి వస్తే సీబీఐ రంగంలోకి దిగుతోందని అది కేసు సీరియస్‌నెస్‌ను బట్టి ఉంటుందని జైట్లీ చెప్పారు. వీటిని రాష్ట్రప్రభుత్వాలు కోర్టులు రిఫర్ చేస్తాయని గుర్తుచేశారు. పశ్చిమ బెంగాల్‌లో శారద చిట్ ఫండ్ స్కామ్, నారదా స్టింగ్ ఆపరేషన్ సాధారణ స్కాములు కాదని అలాంటి వాటిని స్వతంత్ర సంస్థ సీబీఐ విచారిస్తేనే అసలు నిజాలు బయటికొస్తాయని జైట్లీ తెలిపారు.












Click it and Unblock the Notifications