Coronavirus: కరోనా వచ్చిందని హేళన చేసిన మాస్ లీడర్ ని కసకస పొడిచి చంపేశాడు !
ఊటి/ చెన్నై: నీకు కరోనా వైరస్ (COVID-19) వచ్చిందేమో ?, దూరంగా కుర్చో అంటూ హేళన చెయ్యడంతో ఓ కార్మిక సంఘం నాయకుడిని మరో కార్మికుడు దారుణంగా హత్య చేశాడు. కరోనా వైరస్ సోకిందని తమాషాగా అన్న కార్మిక సంఘం నాయకుడిని కత్తితో కసకస అని పొడిచి దారుణంగా పొడిచి హత్య చేసిన సాటి కార్మికుడిని పోలీసులు అరెస్టు చేశారు. కరోనా మహమ్మారి వైరస్ తోనే కాదు పేరుతో కూడా చంపేసే స్థాయికి చేరింది. కరోనా వైరస్ ఎంత భయంకరమైనదో ఈ ఒక్క ఉదాహరణ చాలు. భారతదేశంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ పేరు చెబితెనే చుట్టుపక్కల ఉన్న వారికి ఎక్కడో మండిపోతుంది.

ఊటీ మార్కెట్ లో మాస్ లీడర్
తమిళనాడులోని ప్రపంచ ప్రసిద్ది చెందిన ఊటీ పర్యాటక కేంద్రంలోని తొండిమేడు మార్కెట్ యార్డులో జ్యోతిమణి (40) అనే వ్యక్తి కార్మికుడిగా పని చేస్తున్నాడు. అంతే కాకుండా ఊటీ మార్కెట్ యార్డు కార్మిక సంఘానికి జ్యోతిమణి కార్యదర్శిగా పని చేస్తున్నాడు. మార్కెట్ యార్డులో జ్యోతిమణికి మాస్ లీడర్ అనే పేరు ఉంది.

మాస్ లీడర్ ఫ్రెండ్ మెస్ లో చేపలు ఫేమస్
జ్యోతిమణి స్నేహితుడు నారాయణన్ కుట్టి అదే ప్రాంతంలో మెస్ నడుపుతున్నాడు. నారాయణన్ కుట్టి మెస్ చాలా ఫేమస్. ఈ మెస్ లో చేపల ఫ్రై, చేపల వేపుడుతో పాటు ఆంధ్రా, తమిళనాడు వంటకాలు చాలా ఫేమస్. పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్నవారు, మార్కెట్ యార్డులోని కార్మికులు ప్రతిరోజూ నారాయణన్ కుట్టి మెస్ లో చేపలు తినడానికి వెలుతుంటారు.

కేరళ నుంచి వచ్చిన దేవదాస్
కేరళకు చెందిన దేవదాస్ అనే వ్యక్తి ఊటీలోని మార్కెట్ యార్డు సమీపంలోని బేకరీలో ఉద్యోగం చేస్తున్నాడు. జ్యోతిమణి స్నేహితులతో కలిసి చేపలు తినడానికి స్నేహితుడు నారాయణన్ కుట్టి మెస్ కు వెళ్లాడు. అదే సమయంలో కేరళకు చెందిన దేవదాస్ కూడా భోజనం చెయ్యడానికి మెస్ కు వెళ్లాడు. జ్యోతిమణి చేపలు తింటున్న టేబుల్ లోనే దేవదాస్ కూడా కుర్చుని భోజనం చేస్తున్నాడు.

కరోనా వచ్చిందోమో ? దూరం కుర్చో !
చేపలు తింటున్న జ్యోతిమణిని దేవదాస్ పలకరించాడు. తాను కేరళ నుంచి నిన్ననే వచ్చానని, అందుకే ఇన్ని రోజులు మీకు కనపడలేదని దేవదాస్ జ్యోతిమణికి చెప్పాడు. ఆ సమయంలో నువ్వు దూరంగా కుర్చో, మా పక్కన కుర్చోకూడదని జ్యోతిమణి పక్కనే కుర్చున్న దేవదాస్ కు చెప్పాడు.

కత్తితో కసితీరా కసకసా పొడిచాడు !
నన్ను ఎందుకు పక్కన కుర్చోవాలని చెబుతున్నావు అని దేవదాస్ జ్యోతిమణిని ప్రశ్నించాడు. నువ్వు కేరళకు వెళ్లి వచ్చావు, నీకు కరోనా వైరస్ వ్యాధి వచ్చి ఉంటుంది, అందుకే దూరం కుర్చో అని జ్యోతిమణి ఘాటుగా చెప్పాడు. ఆ సమయంలో జ్యోతిమణి, దేవదాస్ మద్య వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన దేవదాస్ అదే మెస్ లో కూరగాయలు తరుగుతున్న కత్తి తీసుకుని కసితీరా జ్యోతిమణి కడుపు, యదలో కసకసా పోడిచాడు.

కరోనా వచ్చిందంటావా రా !
నాకే కరోనా వచ్చిందంటావా ? ఎంత ధైర్యంరా నా కొడకా అంటూ దేవదాస్ ఇష్టం వచ్చినట్లు పొడవడంతో జ్యోతిమణి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు జ్యోతిమణిని ఊటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై జ్యోతిమణి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన ఊటీ P1 పోలీసులు కేసు నమోదు చేసి దేవదాస్ ను అరెస్టు చేశారు. కరోనా వైరస్ సోకిందని హేళనగా మాట్లాడినందుకే కార్మిక నాయకుడు జ్యోతిమణి దారుణ హత్యకు గురి కావడంతో ఊటీ మార్కెట్ యార్డు ఉలిక్కిపడింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications