Maharashtra Polls: సీఎం పోస్టుపై తేల్చేసిన ఉద్ధవ్ థాక్రే..ఉంటారా, పోతారా..!!

Maharashtra Assembly Election 2024:హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చేశాయి. హర్యానాలో అనూహ్యంగా బీజేపీ అధికారంలోకి రాగా.. జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ రెండు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇక ఫోకస్ మొత్తం మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై పడింది. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలు ఈ సారి హాట్ టాపిక్ కానున్నాయి.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ ముందంజలో రావడంతో ఎన్నికలకు వెళ్లే ఇతర రాష్ట్రాల్లో లెక్కలు తారుమారయ్యాయి.దీంతో ఒక్కసారిగా ప్రధాన నాయకులంతా ముందుగా పార్టీని గెలిపించడంపైనే దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. మహావికాస్ అగాఢీ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైనా సరే తాను మద్దతు ఇస్తానంటూ చెప్పుకొచ్చారు. ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలతో ఒక్కసారిగా అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. ముందు తమ కూటమిని గెలిపించుకోవడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డ ఉద్ధవ్ థాక్రే... మహారాష్ట్రను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎన్నికలకు ముందే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Open to Any CM Candidate Uddhav Urges Allies to Unite Before Maharashtra Elections

"అంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను. కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలి. అది ఎవరైనా సరే నేను మద్దతు ఇస్తాను. నాకు పదవి కన్నా మహారాష్ట్ర సురక్షితంగా ఉండటమే ముఖ్యం. మహారాష్ట్రను భద్రంగా ఉంచేందుకు ఎంతవరకైనా వెళతాను. ఇది నా వాగ్ధానం" అని ఉద్ధవ్ థాక్రే ముంబైలో జరిగిన ఓ సమావేశంలో చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలను ముఖ్యమంత్రి అభ్యర్థిని త్వరగా ప్రకటించాలని ఉద్ధవ్ థాక్రే ఇప్పుడే కాకుండా ఇంతకు ముందు కూడా ఇదే వాణిని వినిపించారు. ఈ ఏడాది ఆగష్టులో మహా వికాస్ అగాఢీ కూటమి సమావేశంలో కూడా సీఎం అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలనే ప్రతిపాదన తెచ్చారు. ఎన్నికల తర్వాత ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందో దాని ప్రకారంగా సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా ముందుగానే ప్రకటిస్తే బాగుంటుందని ఆ సమయంలో థాక్రే ప్రతిపాదించారు. కాంగ్రెస్ లేదా ఎన్సీపీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరున్నా సరే తన సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు.

Open to Any CM Candidate Uddhav Urges Allies to Unite Before Maharashtra Elections

ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పథకాలను ప్రకటించడంపై సీఎం ఏక్‌నాథ్ షిండే బీజేపీలపై నిప్పులు చెరిగారు ఉద్ధవ్ థాక్రే.పథకాల పేరుతో అడ్వర్టయిజ్‌మెంట్లు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి లడకీ బహీన్ యోజన్ పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు రూ.1500 ఇవ్వడం ఒక బూటకమని, అదో స్కామ్ అని ఉద్ధవ్ విమర్శించారు. ఇవన్నీ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి కానీ, వాస్తవరూపం దాల్చడం లేదని మండిపడ్డారు. పన్ను చెల్లింపు దారుల సొమ్ము, ప్రజాధనాన్ని తమ ప్రకటనల కోసం ఖర్చు చేయడాన్ని తప్పుబట్టారు.

ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు, గుజరాత్‌కు ప్రత్యేక తాయిలాలు ఇతర రాష్ట్రాలకు గుండు సున్నా ఇస్తున్నారని మండిపడ్డారు. తాను బీజేపీ నుంచి బయటకు వచ్చినప్పటికీ తన హిందూత్వాన్ని కోల్పోలేదని థాక్రే స్పష్టం చేశారు. బీజేపీ హిందూత్వం అక్రమంగా మారిందని చెప్పుకొచ్చారు. హిందూత్వ పేరుతో బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డ థాక్రే.. తాను పాటించే హిందూత్వం ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలా ఉంటుందని అన్నారు. ఎన్నికల వేళ మోదీ సబ్కా సాథ్, సబ్కా వికాస్ అంటూ ప్రచారం చేస్తున్నారని.. ఎన్నికల్లో గెలిచాక అన్నీ తన మిత్రులకే మేలులు చేస్తున్నారని థాక్రే విమర్శించారు. అచ్చే దిన్ నినాదం ఏమైందని ప్రశ్నించారు. బాలికలకు రూ.1500 ఇచ్చి వారిని చదువుకోకుండా ఇంటికే పరిమితం చేయాలనే దుష్ట ఆలోచన ప్రస్తుత ప్రభుత్వం చేస్తోందని ఉద్ధవ్ థాక్రే మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+