రౌడీబర్త్ డే పార్టీ: టార్గెట్ టీటీవీ దినకరన్ మద్దతుదారులు, ఎన్ కౌంటర్, పళని, పన్నీర్!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: చెన్నైలోని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో నగరంలోని రౌడీలు అందరూ కలిసి స్థానిక ఓటర్లను బెదిరించి, డబ్బులు పంచి టీటీవీ దినకరన్ ను గెలిపించారని ఆరోపణలు గుప్పుమన్నాయి. చెన్నైలో పేరుపొందిన రౌడీషీటర్ బిను నాయకత్వంలోనే ఇదంతా జరిగిందని సమాచారం. అందుకే బిను గ్రాండ్ గా బర్త్ డే పార్టీ జరుపుకున్నాడని తెలిసింది. ఆర్ కే నగర్ ఎన్నికల సమయంలో ఓటర్లు, అధికారిని రివాల్వర్ తో బెదిరిస్తు అరెస్టు అయిన కాకతోపు బాలాజీని పోలీసులు విచారణ చేస్తున్నారు.

రౌడీషీటర్ బిను డీల్

రౌడీషీటర్ బిను డీల్

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో తాము చెప్పిన వారికి ఓటు వెయ్యాలని బెదిరిస్తాని ఓ ప్రముఖ వ్యక్తి దగ్గర రౌడీషీటర్ బిను భారీ మొత్తంలో నగదు తీసుకున్నాడని శుక్రవారం వార్తలు గుప్పుమన్నాయి. ఆర్ కే నగర్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని, తాము చెప్పిన వారికి ఓటు వెయ్యాలని కొంత కాలంగా బెదిరించారని పోలీసుల విచారణలో వెలుగు చూసిందని సమాచారం.

అధికారికి రివాల్వర్ గురి !

అధికారికి రివాల్వర్ గురి !

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల ప్రచారం జరిగే సమయంలో స్థానిక ఓటర్లను మేము చెప్పిన వారికే ఓటు వెయ్యాలని కాకతోపు బాలాజీ అనే రౌడీషీటర్ రివాల్వర్ తో బెదిరించాడు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎన్నికల అధికారి అడ్డుకోవడంతో ఆమె తకు కాకతోపు బాలాజీ రివాల్వర్ గురి పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు కాకతోపు బాలాజీని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

రౌడీ సామ్రారాజ్యం

రౌడీ సామ్రారాజ్యం


ఆర్ కే నగర్ ఉప ఎన్నికల తేదీ ప్రకటించిన మరుసటి రోజు నుంచి రౌడీలు ఆ నియోజక వర్గంలో పర్యటించారని, స్థానిక చిల్లర రౌడీల సహాయంతో గుట్టుచప్పుడు కాకుండా భారీ మొత్తంలో నగదు పంపిణి చేశారని, తాము చెప్పిన వారికి ఓటు వెయ్యకుంటే ప్రాణాలు తీస్తామని బెదిరించారని పోలీసుల విచారణలో అరెస్టు అయిన రౌడీ కాకతోపు బాలాజీ అంగీకరించాడని సమాచారం.

27 ఏళ్ల కిత్రం చెన్నైలో !

27 ఏళ్ల కిత్రం చెన్నైలో !

కేరళకు చెందిన బిను అలియాస్ బిను అప్పచ్చన్ 27 ఏళ్ల కిత్రం చిన్నతనంలోనే చెన్నై చేరుకుని చిన్నచిన్న నేరాలు చేసేవాడు. తనకు ఎదురు తిరిగిన ముగ్గురి తలలు నరికి వాటిని దహనం చేశాడు. తరువాత అతను చెన్నై రౌడీ సామ్రాజ్యానికి లీడర్ అయ్యాడు.

రూ. 50 లక్షలు వసూలు

రూ. 50 లక్షలు వసూలు

రౌడీ సామ్రాజ్యంలోని తన వర్గానికి బర్త్ డే పార్టీ ఇవ్వడానికి ఓ ప్రముఖ కాంట్రాక్టర్ నుంచి బిను రూ. 50 లక్షలు వసూలు చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఆ కాంట్రాక్టర్ ను బెదిరించి బర్త్ డే పార్టీలో బిను తన సహచర రౌడీలతో కలిసి జల్సా చెయ్యాలని ప్రయత్నించాడని పోలీసులు అంటున్నారు.

ఎన్ కౌంటర్

ఎన్ కౌంటర్

తప్పించుకుని తిరుగుతున్న రౌడీషీటర్ బిను ఎదురుతిరిగితే కాల్చివేయాలని తమిళనాడు ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. బిను లాంటి చీడపురుగులు సమాజాంలో ఉండకూడదని, ఉంటే జైల్లోనే ఉండాలని పోలీసు అధికారులు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sources said that the Police Operation Binu may be targetting Dinakaran supporting rowdies who worked for him in RK Nagar By-Elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి