అక్కడికి విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేసిన ఎయిరిండియా: సంచలన నిర్ణయం

జెరూసలేం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారు. రాకెట్లను సంధిస్తోన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ తిప్పి కొడుతోంది. పాలస్తీనాపై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్లు ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.

స్థానిక కాలమనం ప్రకారం.. శనివారం సాయంత్రం ఆరంభమైన హమాస్ ఉగ్రవాదుల రాకెట్ దాడుల్లో 300 మందికి పైగా ఇజ్రాయెలియన్లు మరణించారు. ఈ సంఖ్య అక్కడితో ఆగే అవకాశాలు దాదాపుగా లేవు. అంతకంతకూ మృతుల సంఖ్య పెరిగిపోతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. రాకెట్ దాడుల్లో 2,000 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది.

Operation iron sword: Air India flights to and from Tel Aviv remain suspended till October 14

గాజా స్ట్రిప్‌లోనూ మరణాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. ఇప్పటివరకు 240 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. తమ దేశంలో ఇజ్రాయెల్ సైన్యం పెద్ద ఎత్తున విధ్వంసానకి పాల్పడుతోందంటూ హమాస్ ఉగ్రవాదులు ఆరోపిస్తోన్నారు. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంటామని హెచ్చరించారు.

దాడులు- ప్రతిదాడులతో అటు ఇజ్రాయెల్, ఇటు గాజా స్ట్రిప్, పాలస్తీనాలోని పలు ప్రాంతాల్లో అట్టుడికిపోతున్నాయి. రాకెట్ల ప్రయోగాలు, వైమానిక దాడులతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాము యుద్ధం చేస్తోన్నామంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సైతం ప్రకటించారంటే- దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎయిరిండియా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇజ్రాయెల్‌కు అన్ని విమాన సర్వీసులను నిలిపివేసింది. టెల్ అవివ్, జెరూసలెం నగరాలకు విమానాలను నడిపించట్లేదని తెలిపింది. ఈ నెల 14వ తేదీ వరకు విమానాల రద్దు కొనసాగుతుందని పేర్కొంది.

Operation iron sword: Air India flights to and from Tel Aviv remain suspended till October 14

ఈ మేరకు ఎయిరిండియా యాజమాన్యం ఓ ప్రకటన జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. 14వ తేదీ తరువాత- అప్పటి పరిస్థితులను సమీక్షించిన అనంతరం విమాన సర్వీసులను పునరుద్ధరించాలా? వద్దా? అనేది వెల్లడిస్తామని పేర్కొంది.

ఈ నెల 14వ తేదీ వరకు టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేశామని ఎయిరిండియా తెలిపింది. వారికి అవసరమైన సపోర్ట్‌ను అందజేస్తామని, టెల్ అవివ్, ఇతర నగరాలకు టికెట్లను రీషెడ్యూల్ చేసే సమయం వివరిస్తామని పేర్కొంది. టెల్ అవివ్ నుంచి విమానాలు రావడం గానీ, అక్కడికి వెళ్లడం గానీ ఉండబోవని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+