Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jharkhand Elections: బీజేపీ ముందున్న సవాళ్లు ఏంటి..అక్కడ కమలం వికసిస్తుందా..?

Jharkhand Elections:జార్ఖండ్‌లో ఎన్నికల హీట్ పెరిగింది. తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని హేమంత్ సోరెన్ పార్టీ జేఎంఎం భావిస్తుండగా... హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతను క్యాష్ చేసుకుని అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. అమితమైన సహజవనరులు కల్గిన రాష్ట్రంగా పేరుగాంచిన జార్ఖండ్ వైపు దేశం మొత్తం చూస్తోంది. అయితే అధికారంలోకి రావాలని చూస్తోన్న బీజేపీ ముందు ఎలాంటి సవాళ్లున్నాయి..?

జార్ఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే. అయితే దీన్నే క్యాష్ చేసుకుని పావులు కదుపుతోంది కమలం పార్టీ. హేమంత్ సోరేన్ కుటుంబంలో విబేధాలు, పార్టీలో తిరుగుబాటు, భూ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు హేమంత్ సోరెన్. ఇవే అంశాలు హేమంత్ సోరెన్ గెలుపునకు మార్గం కష్టతరం చేస్తోందనే వాదన వినిపిస్తోంది. బీజేపీ భావన కూడా ఇదేలా ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో బీజేపీ పునరాలోచనలో పడింది.

Opinion BJPs Roadblocks in Jharkhand Will Modi factor Turn the Tide

గిరిజన ప్రాబల్యం..

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్నులొట్టబోయింది. జార్ఖండ్‌లోని 14 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. గిరిజనులు ప్రాబల్యం ఎక్కువగా ఉండే లోక్‌సభ స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.ఖుంతీ,లోహర్‌దగా, చైబాసా, రాజ్‌మహల్, దుమ్కా స్థానాల్లో గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది.ఇక్కడ బీజేపీ ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది.ఈ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లక్ష నుంచి లక్షన్నర ఓట్ల తేడాతో ఓడిపోయారు. దివంగత బీజేపీ నేత దుర్గా సోరెన్ భార్య సీతా సోరెన్ కూడా పోటీ చేసిన దుమ్కా లోక్‌సభ స్థానంలో విజయం సాధించలేకపోయారు.జేఎంఎం అభ్యర్థి నళిన్ సోరెన్ చేతిలో ఓటమిపాలయ్యారు.

Opinion BJPs Roadblocks in Jharkhand Will Modi factor Turn the Tide

హేమంత్ సోరెన్ పై సానుభూతి..

ఈ ఏడాది జనవరిలో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్టును గిరిజనుల ఆత్మగౌరవంతో ముడిపెట్టింది జేఎంఎం పార్టీ.దీంతో గిరిజనుల్లో హేమంత్ సోరెన్‌ పట్ల సానుభూతి పెరిగింది. ఇదే సానుభూతి ఎన్నికల్లో జేఎంఎంకు కలిసొచ్చింది. దీంతో గిరిజన ప్రాబల్యం ఉన్న లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ఇమేజ్ వర్కౌట్ అయ్యింది. మోదీ ప్రజాదరణ ఇప్పటికీ కాదనలేము.లోక్‌సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్ బీజేపీ పనితీరు బలహీనంగా ఉన్నప్పటికీ అక్కడ మోదీ ఇమేజ్‌ కలిసిరావడంతో గట్టునపడింది బీజేపీ. కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మోదీ ఇమేజ్ ఎంతవరకు కలిసొస్తుందనేది ప్రధాన ప్రశ్నగా మారింది.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం నుంచి హేమంత్ సోరెన్ ఎలాగు ఉన్నారు.ఆయన అరెస్టు అక్రమంగా జరిగిందని బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలను కోరే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైతే సానుభూతి లభించిందో ఇప్పుడు అదే అస్త్రాన్ని ప్రయోగించేందుకు హేమంత్ సోరెన్ రెడీ అవుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో గిరిజనుల ప్రాబల్యం ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో కచ్చితంగా బీజేపీకి చుక్కెదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

గెలుపు గుర్రాలకే టికెట్..

బీజేపీ ఈ పెను సవాళ్లను దాటుకునేందుకు ప్రయత్నిస్తోంది.గిరిజన ప్రాంతాలపై ఎక్కువగా ఫోకస్ చేసింది. అక్కడి అభ్యర్థులను కూడా దాదాపుగా మార్చేందుకు స్కెచ్ రెడీ చేస్తోంది. గెలుపు గుర్రాలైన గిరిజన అభ్యర్థులనే రంగంలోకి దింపాలని యోచిస్తోంది. దాదాపుగా 25 మంది అభ్యర్థులను బీజేపీ మార్చనున్నట్లు సమాచారం. ఈ వారంలోనే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. ఇదే జరిగితే టికెట్ దక్కని అభ్యర్థులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం లేకపోలేదు. ఇది కూడా బీజేపీకి మరో సమస్యగా మారింది. మొత్తానికి బీజేపీ అధికారంలోకి రావాలంటే చాలా ఫ్యాక్టర్స్ అనుకూలంగా మారాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+