రవి మృతి: గవర్నర్‌తో కలిసిన బీజేపీ, జేడీఎస్ నేతలు, పాదయాత్ర
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానాస్పద మృ తి కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తు బీజేపీ, జేడీఎస్ శాసన సభ్యులు, ఎంఎల్సీలు గురువారం బెంగళూరులో పాదయాత్ర చేశారు. గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో శాసన సభ సమావేశాలు వాయిదా పడ్డాయి. తరువాత బీజేపీ, జేడీఎస్ శాసన సభ్యులు విధాన సౌధ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గరకు చేరుకున్నారు.
అదే సమయంలో బీజేపీ, జేడీఎస్ ఎంఎల్సీలు అక్కడికి చేరుకున్నారు. తరువాత నల్ల జెండాలు చేత పట్టుకుని నల్ల బ్యాడ్జ్ లు వేసుకుని అక్కడి నుండి రాజ్ భవన్ దగ్గరకు పాదయాత్ర చేశారు. శాసన సభలో ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, శాసన మండలి ప్రతిపక్ష నాయకులు ఈశ్వరప్ప (బీజేపీ), బసవరాజ్ హొరట్టి (జేడీఎస్), మాజీ హొం శాఖ మంత్రి ఆర్. అశోక్, సీటి. రవి తదితరులు పాదయాత్రలో పాల్గోన్నారు.

ముఖ్యమంతి సిద్దరామయ్య డౌన్ డౌన్, హొం శాఖ మంత్రి జార్జ్ డౌన్ డౌన్, డి.కే. రవి కుటుంబానికి న్యాయం జరగాలని నినాదాలు చేస్తూ రాజ్ భవన్ చేరుకున్నారు. తరువాత బీజేపీ నుండి జగదీష్ శెట్టర్, జేడీఎస్ నుండి కుమారస్వామి గవర్నర్ వాజుబాయ్ ఆర్ వాల ( వీఆర్. వాల)కు వినతి పత్రం అందించారు. ఐఏఎస్ అధికారి డి.కే. రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించడానికి చర్యలు తీసుకొవాలని మనవి చేశారు.
నివేదిక వచ్చిన తరువాత...
2009 లో రవి ఐఏఎస్ అధికారి అయ్యాడంటూ అప్పటి నుండి సోమవారం వరకు రవి జీవితంలో జరిగిన ప్రధాన సంఘటనలు, రవికి బెదరింపులు వచ్చాయని బీజేపీ, జేడీఎస్ నాయకులు గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. వారు చెప్పిన మాటలు పూర్తి అయిన తరువాత గవర్నర్ వీ.ఆర్. వాల స్పందించారు.
ఐఏఎస్ అధికారి రవి కేసు పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సూచించామని గవర్నర్ వీ.ఆర్. వాల అన్నారు. నివేదిక వచ్చిన తరువాత తాను ఈ విషయంపై స్పందిస్తానని బీజేపీ, జేడీఎస్ నాయకులకు గవర్నర్ వాల హామి ఇచ్చారు.












Click it and Unblock the Notifications