వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒప్పో జర్నీ ఈ దిశగా: స్మార్ట్‌ఫోన్లలో మెగా సెల్ఫీలకు పునర్నిర్వచనం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత ఐదేళ్లుగా సెల్ఫీ ఆధారిత స్మార్ట్‌ఫోన్ల ట్రెండ్ నడుస్తోంది. హ్యాండ్ సెట్లలో హై పవర్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్యాకింగ్ వాటి ఉత్పత్తిదారులు పెరగడమే
ఇందుకు నిదర్శనం.

ప్రస్తుతానికి అల్టిమేట్ సెల్ఫీ షాట్లను పట్టుకునే శక్తిగల రెండు ఫ్రంట్ కెమెరాల సెల్ఫీ సెంట్రిక్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. మనల్ని మనం ఫొటోలు తీసుకోవడం పట్ల పెరుగుతున్న అనురక్తి,, ఇతరులకు మనల్ని అత్యుత్తమంగా ప్రదర్శించకోవాలనే కోరిక కారణంగా స్మార్ట్‌ఫోన్ కెమెరాలు అత్యంత వేగంగా దూసుకుపోతున్నాయి.

ఈ సెల్ఫీ ఆధారిత స్మార్ట్‌ఫోన్ల ప్రగతికి చైనా మొబైల్ ఉత్పత్తిదారు ఒప్పో సాయం చేస్తోంది. వినియోగదారుల అవసరాలను ఎంతో బాగా అర్థం చేసుకుని ఆ మేరకు ఉత్తమమైనవాటిని అందించడంలో ఇది దిట్ట.

OPPOs Journey Towards Redefining Selfies In Smartphones

ఇటీవలి సంవత్సరాల్లో ఒప్పో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లకు ప్రసిద్ది చెందింది. మొబైల్ ఫొటోగ్రఫీలో, ప్రత్యేకించి వినియోగదారులు నాచ్ - స్క్రీన్ సెల్ఫ్ - ఫొట్రయిట్స్‌ ఫొటోగ్రఫీపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం వల్ల స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఒప్పొ చాలా వేగంగా ఎదిగింది. సమకాలీన కెమెరా పరిణామం స్పష్టంగా ఉన్నప్పటికీ ఇది సాధారణ ట్రాన్స్‌ఫార్మేషన్ కన్నా మించి ప్రదర్శిస్తుంది.

2013కి వెళ్తే, ఒప్పో ప్రపంచంలోనే మొదటి రొటేటింగ్ 13ఎంపి కెమెరాను ఎన్1 వెర్షన్‌ను విడుదల చేసింది. రెండు ఫ్రంట్, బ్యాక్ స్నాపర్స్ చిత్రాలను బంధించడంలో అత్యంత నేర్పును ప్రదర్శించింది. తరవాత ఆ వరుసలో ఎన్3 ని విడుదల చేసింది. అది పూర్టిగా ఆటోమేటెడ్ 16ఎంపి రొటేటింగ్ కెమెరా. దానికి కెమెరా పనితనాలను నియంత్రించడానికి పొర్టబుల్ రిమోట్ ఉంటుంది.

OPPOs Journey Towards Redefining Selfies In Smartphones

దాని తర్వాత ఎఫ్1ఎస్, ఎఫ్1ఎస్ ప్లస్ వచ్చాయి. ఉన్నత ప్రమాణాలకు గీటురాయిగా నిలిచి, 16ఎంపీ ఫ్రంట్ షూటర్ విషయంలో మొట్టముదటి డివైస్‌గా పేరు పొందాయి.

2012లో ఒప్పో సెల్ఫీ క్రేజ్‌డ్ మార్కెట్‌లోకి యూ701 ప్రవేశించింది. బ్యూటిఫికేషన్ కలిగిన స్మార్టఫోన్లలోనే ఉత్తమంగా 1.0బ్యూటీ ఫీచర్‌తో ఇది అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత దీని 4వ లిటరేషన్, బ్యూటీ 4.0 కలిపి వచ్చింది. కస్టమైజ్డ్ బ్యూటిఫికేషన్, నాచురల్ స్కిత్ ఎఫెక్ట్స్‌తో ఒప్పో ఎఫ్3, ఒప్పో ఎఫ్3ప్లస్ మార్కెట్లోకి వచ్చాయి.

అడ్వాన్స్‌డ్ అల్గారిథమ్స్, ఇంటెలిజెంట్ బ్యూటికేషన్ ఏడు దశల్లో, రెండు స్కిన్ టోన్ మోడ్స్ తో అద్భుతంగా రూపొందించబడింది. సెల్ఫీ ప్రియులకు ఇది అత్యుత్తమ బ్యూటిఫికేషన్ ఎడిట్స్ ని అందిస్తోంది.

OPPOs Journey Towards Redefining Selfies In Smartphones

ఆర్ అండ్ డీ హార్డ్‌వేర్ కెపాసిటీ కోసం ఒప్పో తీవ్రంగా శ్రమించి ఉన్నత ప్రమాణాలతో స్మార్ట్ ఫోన్లతో కెమెరాలను అందిస్తోంది. ఇమేజ్ సెన్సార్‌తో స్మార్ట్ ఫోన్లలో ఒప్పోనే మేటీ అని చెప్పవచ్చు. ఎన్నో మెరుగైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌ను కొత్త పుంతలు తొక్కించడం, ఆప్టిక్స్, ఇమేజ్ సెన్సార్స్, ఇతర నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకపోవడంతో ప్రపంచంలో సేల్స్ రికార్డులను సృష్టించింది.

అంతేగాక, మార్చి 26న ఒప్పో ఎఫ్7 తన తాజా స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనుంది. ఇందులో రీ ఇమేజిన్ సెల్ఫీ కెమెరాలు ఉండటం విశేషం. ఇందులో 25 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండటంతో అత్యంత నాణ్యమైన సెల్పీలను దిగే అవకాశం ఉంటుంది. నాటరిక్ ఇమేజ్ సెన్సార్ కారణంగా ఫొటోలు ఎంతో స్పష్టంగా, వేగంగా తీసుకోవచ్చు. ఎఫ్7లో నెక్ట్స్ జనరేషన్ సెన్సార్-హెచ్‌డీఆర్, రంగులను స్పష్టంగా గుర్తించి స్పష్టంగా కనిపించేలా ఫొటోలు తీస్తుంది. లో లైట్ కండిషన్లో కూడా ఫొటోలను ఇతర ఫోన్ కెమెరాల కంటే అద్భుతంగా తీయగలదు.

ఒప్పో ఎఫ్7 ప్రత్యేకమైన ఏరీనా ఏఐ 2.0పవర్ బ్యూటిఫికేషన్ సామర్థ్యాలను కలిగివుంది. మీ స్కిన్ తోపాటు కళ్లు, వెంట్రుకలు మరింత అంతంగా కనిపించేలా చేస్తుంది.

స్కిన్ టోన్, ఏజ్, జెండర్ ఫలితాల ఆధారంగా ఫొటోలను స్పష్టంగా తీస్తుంది. మీరున్నదానికంటే ఎక్కువ అందంగా ఫొటోలను తీసుకోవచ్చు.

ఏఐ పవర్డ్ ఎడిటింగ్, ఫొటో ఆల్బమ్ అప్లికేషన్స్ ఫీచర్లు దీనికి అదనంగా ఉన్నాయి. కవర్ షాట్, ఏఆర్(అనుబంధ వాస్తవికత) స్టిక్కర్స్ లతో యూజర్‌ని పర్సనల్ బ్యూటీ ఆర్టిస్టుగా తయారు చేస్తాయి.

కవర్ షాట్ ఫీచర్ ద్వారా సెల్ఫీ కలర్‌ను కోరుకున్న విధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే వేసుకున్న దుస్తులు, బ్యాక్ గ్రాండ్, ఇతరాలను మార్చుకునే వీలుంటుంది. అంతేగాక, ఏఆర్ స్టిక్కర్, స్నాప్ చాట్ ద్వారా ఆటలను కూడా ఆడుకోవచ్చు. సెల్ఫీలను తీసుకుని వాటిని అందమైన కుందేలు, నచ్చిన సినీ నటులుగా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు.

కొత్త ఎఫ్7 వర్షన్ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌తో రూపొందించబడటం గమనార్హం.

ఎఫ్7 అద్భుతమైన విధంగా 6.23 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ(1080x2280 పిక్సెల్స్) డిస్‌ప్లే, సూపర్ ఫుల్ స్క్రీన్ 2.0 ప్యానెల్.. స్పోర్ట్స్ 89.1శాతంతో. స్క్రీన్ పెద్దదిగా ఉండటం వల్ల గేమ్స్ ఆడుకోవడం కానీ, చదువుకోవడం గానీ సౌకర్యంగా ఉంటుంది. అంతేగాక, చేతులో ఇమిడే విధంగా ఉంది.

సోలార్ రెడ్, స్టార్రీ బ్లూ, మూన్ లైట్ సిల్వర్ రంగులలో ఎఫ్ 7 అందుబాటులోకి వస్తోంది. ఈ డిజైన్ ప్రాసెసింగ్ ఇంజినీరింగ్‌లో మరో సంచలనంగా మారే అవకాశం ఉంది. 128జీబీ ప్రత్యేక ఎడిషన్ కూడా ఈ ఒప్పో ఫోన్‌కు అదనపు ఆకర్షణ.

ఇలాంటి అద్భుతమైన ఫీచర్లతో కూడిన కొత్త ఒప్పో ఎఫ్ 7 పొందడానికి మార్చి 26 వరకు ఆగాల్సిందే. దీనికి సంబంధించిన ఇతర తాజా విషయాల కోసం ఎదురు చూడాల్సిందే.

English summary
Since the last five years, selfie-oriented smartphones have been a booming trend, as evidenced by the increasing number of manufacturers, packing high-powered, front-facing cameras in their handsets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X