Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బోర్డు పరీక్షలు రద్దు చేయాల్సిందే-విద్యార్ధులు, విపక్షాల డిమాండ్లు-హాట్‌స్పాట్ల ప్రమాదం

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు విద్యార్దులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సరిగ్గా పరీక్షల వేళ కరోనా కల్లోలం పరీక్షలపై వారిని దృష్టిపెట్టనీయకుండా చేస్తోంది. పరీక్షలపై పెట్టాల్సిన దృష్టి కాస్తా కరోనాపై పెట్టాల్సి రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే అన్ని బోర్డు పరీక్షలను రద్దు చేయాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. విద్యార్ది సంఘాల నుంచి మొదలైన ఈ డిమాండ్‌ను ఇప్పుడు విపక్షాలు కూడా సమర్దించడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది.

పరీక్షలపై కరోనా సెకండ్‌వేవ్‌ ప్రభావం

పరీక్షలపై కరోనా సెకండ్‌వేవ్‌ ప్రభావం

దేశవ్యాప్తంగా నానాటికీ విజృంభిస్తున్న కరోనా కేసుల ప్రభావం బోర్డు పరీక్షలపై పడుతోంది. సరిగ్గా పరీక్షల వేళ మహారాష్ట్ర, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు విద్యార్దుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తల్లితండ్రులు సైతం పరీక్షలకు విద్యార్దుల్ని పంపేందుకు ఇష్టపడటం లేదు. దీంతో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచనలో పడుతున్నాయి. అయితే ఇప్పటివరకూ కేంద్రం దీనిపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ఆందోళనలో ఉన్న విద్యార్దులకు విపక్షాలు జతకలుస్తున్నాయి.

బోర్డు పరీక్షల రద్దు డిమాండ్లు

బోర్డు పరీక్షల రద్దు డిమాండ్లు


మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దీంతో అలాంటి పరిస్దితుల్లో సీబీఎస్‌ఈ, ఐసీఎస్ఈసీతో పాటు పలు బోర్డు పరీక్షల నిర్వహణ సందిగ్ధంలో పడింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాము పరీక్షలకు సిద్దంగా లేమని విద్యార్దులు చెప్తుండగా.. విద్యార్ది సంఘాలు కూడా పరీక్షల రద్దు డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నాయి. పరిస్ధితిని గమనిస్తున్న విపక్షాలు కూడా పరీక్షల రద్దు డిమాండ్లు చేస్తున్నాయి. కేంద్రం వెంటనే పరీక్షల రద్దుపై ప్రకటన చేయాలని ప్రధాన విపక్షం కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు కోరుతున్నాయి.

 హోరెత్తుతున్న సోషల్ మీడియా

హోరెత్తుతున్న సోషల్ మీడియా

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో లక్షన్నర కోవిడ్‌ కేసులు వచ్చిన నేపథ్యంలో బోర్డు పరీక్షలు రద్దు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై విద్యార్ధులు, విద్యార్ది సంఘాలు, తల్లితండ్రులు, విపక్ష పార్టీలు పరీక్షల రద్దుకు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే విషయంపై ఛేంద్‌ డాట్‌ ఆర్గ్‌ వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్న అభిప్రాయ సేకరణలో దాదాపు రెండు లక్షలకు పైగా తల్లితండ్రులు, విద్యార్దులు, టీచర్లు, పరీక్షల రద్దుకు సంతకాలు చేశారు. #cancelboardexam2021 పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ పెట్టి తమ డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తున్నారు.

హాట్‌స్పాట్లుగా మారితే కేంద్రానిదే బాధ్యత

హాట్‌స్పాట్లుగా మారితే కేంద్రానిదే బాధ్యత


కేంద్రం పరీక్షల రద్దుపై మొండిగా ముందుకెళ్లడం మంచిది కాదని ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ పార్టీ సూచిస్తోంది. కరోనా కల్లోలం నేపథ్యంలో బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్రం పునరాలోచించారని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ కోరారు. పరీక్షల రద్దుపై అన్ని వర్గాలతో చర్చించాలని ఆయన కేంద్రానికి సూచించారు. కేంద్రం కరోనాను పట్టించుకోకుండా పరీక్షలు నిర్వహించాలని భావించడం సరికాదని రాహుల్‌ సోదరి ప్రియాంక కేంద్ర విద్యాశాఖమంత్రి రమేష్ పోఖ్రియాల్‌కు లేఖ రాశారు, పరీక్షా కేంద్రాలు హాట్‌స్పాట్లుగా మారితే కేంద్రమే బాద్యత వహించాలని ఆమె హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+