వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈసీని కలిసిన ఎన్డీయేతర పక్షాల నేతలు..! బాబు నేతృత్వంలో ఢిల్లీలో భేటీ ఐన విపక్ష నేతలు..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఎన్డీయేత్రర పార్టీల నాయకులు సమావేశమయ్యారు. పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల నుంచి రాంగోపాల్ యాదవ్ ఎస్పీ, గులాంనబీ అజాద్, అహ్మద్ పటేల్, సీతారాం ఏచూరి, కనిమొళి, సురవరం సుధాకర్ రెడ్డి, డి. రాజా హాజరయ్యారు. ఎలక్షన్ కమిషన్ అనుసరిస్తున్న తీరు, వీ వీ ఫ్యాట్ ల లెక్కింపు పై చర్చించనున్నారు. సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర ఎన్నికల కమిషనర్ ని 21 పార్టీల నాయకులు సంప్రదించారు.

 దేశ రాజధానిలో చంద్రబాబు బిజీ బిజీ..! బీజేపియేతర నేతలతో వరుస భేటీలు..!!

దేశ రాజధానిలో చంద్రబాబు బిజీ బిజీ..! బీజేపియేతర నేతలతో వరుస భేటీలు..!!

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరుతూ ప్రతిపక్ష నేతలు మంగళవారం ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఒక్క పోలింగ్‌ బూత్‌లోని వీవీప్యాట్‌ స్లిప్పుల్లో తేడాలు వచ్చినా.. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని వీవీప్యాట్‌ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలని విపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 50శాతం వీవీప్యాట్లు లెక్కించాల్సిందేనని, దానికనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందేనని నేతలు కోరినట్లు సమాచారం. ఈసీ ఇచ్చిన సమాధానం ఆధారంగా 21 విపక్ష పార్టీల నేతలు తదుపరి కార్యాచరణను సిద్ధం చేయనున్నారు.

 ఈసీ పనితీరుపై చర్చ..! ఈవీయంల పై దృష్టి పెట్టిన జాతీయ నేతలు..!!

ఈసీ పనితీరుపై చర్చ..! ఈవీయంల పై దృష్టి పెట్టిన జాతీయ నేతలు..!!

అంతకుముందు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఎన్డీయేతర పక్షాల నేతలంతా సమావేశమయ్యారు. ఆయా పార్టీకు చెందిన నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నుంచి అహ్మద్‌ పటేల్‌, అశోక్‌ గెహ్లోత్‌‌, అభిషేక్‌ మను సింఘ్వీ, ఆప్‌ నుంచి దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఆ పార్టీ నేత సంజయ్‌సింగ్‌, తెదేపా నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సీపీఐ నుంచి సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే నేత కణిమొళి, ఆర్జేడీ నేత మనోజ్‌ ఝూ, ఎన్సీపీ నుంచి ప్రఫుల్‌ పటేల్‌, ఎస్పీ నుంచి రామ్‌కృపాల్‌ యాదవ్‌, టీఎంసీ నుంచి డెరెక్‌ ఒబ్రెయిన్‌, బీఎస్పీ నుంచి సతీశ్‌చంద్ర మిశ్రా, ఎస్పీ నుంచి దేవేందర్‌రాణా హాజరై ఈసీ విధానాలు, మహాకూటమి గురించి చర్చించారు. అనంతరం అక్కడి నుంచి ఈసీ కార్యాలయానికి చేరుకొని ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారు.

ఫలితాలకు ముందు విపక్షాల నేతల భేటీ..! ఆసక్తికరంగా దేశ రాజకీయాలు..!!

కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న పక్షపాత ధోరణిపై చర్చించేందుకు దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఎన్డీయేతర పక్షాల నేతలు సమావేశమయ్యారు. మొత్తం 19 పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నుంచి అహ్మద్‌ పటేల్‌, అశోక్‌ గెహ్లోత్‌‌, అభిషేక్‌ మను సింఘ్వీ, ఆప్‌ నుంచి దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఆ పార్టీ నేత సంజయ్‌సింగ్‌, తెదేపా నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సీపీఐ నుంచి సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే నేత కణిమొళి, ఆర్జేడీ నేత మనోజ్‌ ఝూ, ఎన్సీపీ నుంచి ప్రఫుల్‌ పటేల్‌, ఎస్పీ నుంచి రామ్‌కృపాల్‌ యాదవ్‌, టీఎంసీ నుంచి డెరెక్‌ ఒబ్రెయిన్‌, బీఎస్పీ నుంచి సతీశ్‌చంద్ర మిశ్రా, ఎస్పీ నుంచి దేవేందర్‌రాణా తదితరులు హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత నేతలంతా ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు.

హాజరుకాని కుమార స్వామి..! సమయం లేదన్న కన్నడ సీఎం..!!

హాజరుకాని కుమార స్వామి..! సమయం లేదన్న కన్నడ సీఎం..!!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కర్ణాటక సీఎం హెచ్‌.డి. కుమారస్వామి ఝలక్‌ ఇచ్చారు. ఎన్నికల సంఘం వద్ద చంద్రబాబు చేపట్టేబోయే నిరసన కార్యక్రమానికి కుమారస్వామి దూరంగా ఉన్నారు. ఈసీ వద్ద ప్రతిపక్షాలు ఈ రోజు చేపట్టబోయే నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని తొలుత భావించిన కుమారస్వామి.. ఎగ్జిట్‌ పోల్స్‌తో మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కుమారస్వామి తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

English summary
The leaders of the opposition parties met in Delhi Constitution Club of India under the leadership of AP Chief Minister Chandrababu Naidu. Ram Gopal Yadav SP, Ghulam Nabi Azad, Ahmed Patel, Sitaram Yechury, Kanimozhi, Suravaram Sudhakar Reddy, D. Raja attended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X