ప్రధాని పదవిపై తేల్చేసిన ఖర్గే- బెంగళూరు భేటీలో బిగ్ స్టేట్‌మెంట్

బెంగళూరు: వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ- దీని దూకుడును నిలువరించడానికి యూపీఏ సమాయాత్తమౌతోన్నాయి. ఎన్డీఏను ఉమ్మడిగా ఎదుర్కొనడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమౌతోన్నాయి.

ఇదివరకు బిహార్ రాజధాని పాట్నాలో తొలిసారిగా భేటీ అయ్యాయి. దీనికి కొనసాగింపుగా బెంగళూరులో మలి విడత భేటీని నిర్వహించాయి. దేశవ్యాప్తంగా 26 ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇందులో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ సంకీర్ణ కూటమిని ఎదుర్కొనడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తోన్నారు.

mallikarjunkharges1

ఈ సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర స్థాయిలో తమలో కొందరి మధ్య విభేదాలు ఉన్నాయనే విషయాన్ని అంగీకరించారు. రాష్ట్రస్థాయిలో అధికారంలో ఉండటం, ప్రతిపక్ష పార్టీలతో సైద్ధాంతికపరంగా విభేదించడం వంటి పరిణామాలు నెలకొన్నాయని పేర్కొన్నారు

ఆయా విభేదాలన్నీ సైద్ధాంతికమైనవి కావని, సమాజ శ్రేయస్సు కోసం రెండు పార్టీల మధ్య ఉండే భావసారూప్యమని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో మాత్రం ఆయా విభేదాలన్నింటినీ పక్కన పెట్టి ఏకం కావాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

mallikarjunkharges1

ఎన్డీఏ హయాంలో దేశవ్యాప్తగా పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, మధ్యతరగతి, యువత, పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల హక్కులు తెరవెనుక నిశ్శబ్దంగా అణచివేతకు గురవుతున్నాయని అన్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటే రాష్ట్రస్థాయిలో తమ మధ్య ఉన్న ఈ విభేదాలు పెద్దవి కాబోవని ఖర్గే తేల్చి చెప్పారు.

కాంగ్రెస్‌కు అధికారంపైనా, ప్రధాని పదవిపైనా ఏ మాత్రం ఆసక్తి లేదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఈ విషయాన్ని- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పుట్టినరోజు నాడు చెన్నైలో జరిగిన సమావేశంలోనే వెల్లడించానని చెప్పారు. ప్రతిపక్షాల భేటీని నిర్వహించే ఉద్దేశం- అధికారాన్ని అందుకోవడం కాదని ఖర్గే వివరించారు.

mallikarjunkharges1

రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడానికి ఎన్డీఏ కూటమిని ఓడించాల్సిన అవసరం ఉందని ఖర్గే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి దర్యాప్తు సంస్థను ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఆయుధంగా మారుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీలను ప్రతిపక్షాలపైనే ఎందుకు ప్రయోగిస్తోన్నారని ప్రశ్నించారు.

ప్రతిపక్ష నాయకులపై తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టడం వల్ల వారు చట్టపరమైన ప్రక్రియలో చిక్కుకుంటారని, దాన్ని రాజకీయంగా తనకు ఉపయోగకరంగా బీజేపీ మార్చుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల ఎంపీలను సస్పెండ్ చేయడానికి రాజ్యాంగ అధికారాలను ఉపయోగించారని, ప్రభుత్వాలను పడగొట్టడానికి ఎమ్మెల్యేలను బ్లాక్ మెయిల్ చేస్తోన్న వారిపై ఎందుకు ప్రయోగించట్లేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+