సీఎంకు సినిమా చూపించాలని ఏకమైన ప్రతిపక్షాలు, శీతాకాలంలో దుప్పట్లు గ్యారెంటీ !
సోమవారం నుంచి బెళగావిలోరని సువర్ణ సౌధలో పదిరోజుల కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా ఆ సభలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుక పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జేడీఎస్ నేతలు సిద్దం అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొరడా ఝులిపించేందుకు కర్ణాటకలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పక్కా ప్రణాలిక సిద్దం చేసుకుంటున్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక్ తదితరులు బెంగళూరులోని రేస్‌కోర్స్ రోడ్డులోని విపక్షనేత ఆర్.అశోక్ నివాసంలో సమావేశం అయ్యారు. రెండు పార్టీల నాయకులు అసెంబ్లీ సమావేశాల్లో సిద్దరామయ్య ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని బీజేపీ, జేడీఎస్ పార్టీల నాయకులు నిర్ణయం తీసుకున్నారు.

ఉత్తర కర్ణాటక సమస్యలతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి అంశాలు లేవనెత్తాలి, సిద్దరామయ్య ప్రభుత్వంపై పోరాటానికి రూపురేఖలు ఎలా ఉండాలనే దానిపై బీజేపీ, జేడీఎస్ నేతలు చర్చలు జరిపారని వెలుగు చూసింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై సమర్ధవంతమైన పోరాటానికి ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత హామీ పథకాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ ఉచిత హామీ పథకాల అమలు చెయ్యడంలో విఫలం అయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు.
అధికార పార్టీ వైఫల్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి బీజేపీ, జేడీఎస్ పార్టీలు సిద్ధమైనాయి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో సక్రమంగా వర్షాలు కురవక కరవు నిర్వహణలో సిద్దరామయ్య ప్రభుత్వం విఫలం అయ్యిందని, ఆ ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేపీ, జేడీఎస్ నాయకులు డిసైడ్ అయ్యారని తెలిసింది. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలు, కాంట్రాక్టర్ల ఆత్మహత్యల కేసుల విషయం అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పట్టుబట్టాలని ప్రతిపక్షాలు సిద్దం అయ్యాయి.
కర్ణాటక ప్రభుత్వం ఎమ్మెల్యేలకు నిధులు విడుదల చెయ్యడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వయంగా మనస్తాపం చెందడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేలకు గ్రాంట్లు విడుదల కాకపోవడం, అభివృద్ధి పనులకు నిధులు విడుదల చెయ్యకపోవడం వంటి అనేక అంశాలను అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తి సిద్ధరామయ్య ప్రభుత్వంపై పోరాటానికి మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి వ్యూహం రచించినట్లు సమాచారం.
కర్ణాటక మంత్రి యు.టి. ఖాదర్‌కు బీజేపీ ఎమ్మెల్యేలు చేతులు జోడించి వేడుకునే రోజులు వస్తాయని ఆ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చెయ్యాలని బీజేపీ, జేడీఎస్ నాయకులు నిర్ణయించారు. చేసిన ప్రకటనపై బీజేపీ, జేడీ(ఎస్) నేతలు సభలో క్షమాపణలు చెప్పించాలని నిర్ణయించారు.

బీజేపీ నేతలతో సమావేశం ముగిసిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ బెళగావిలోని సువర్ణసౌధలో జరగనున్న అసెంబ్లీ సమావేశంలో సమస్యలపై, పోరాటంపై చర్చించామని ఎలాంటి పోరాటం చెయ్యాలని అని తరువాత స్పష్టంగా చెబుతామని, సిద్దరామయ్య ప్రభుత్వం వచ్చాక ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందని, స్వార్థపరులు బాగా సంపాధించుకుంటుననారని, దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పిన మాజీ సీఎం కుమారస్వామి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications