లఖింపూర్‌లో రైతులపై దాడికి బాధ్యత కేంద్ర మంత్రిదే.. అజయ్ మిశ్రా రాజీనామాకు విపక్షాల డిమాండ్
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరిలో రైతులపై జరిగిన హింసాత్మక సంఘటన అనుకోకుండా జరిగింది కాదని ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికలో స్పష్టం చేసింది. కుట్రలో భాగంగానే రైతులపై దాడి జరిగిందని తేల్చిచెప్పింది. ఇంతటి హింసాత్మక ఘటనపై కేంద్ర ప్రభుత్వ తీరు సరిగా లేదంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. ఈ అంశాన్ని కూడా పార్లమెంటులో కూడా చర్చించారా.. అని నిలదీస్తున్నాయి. ఈ ఘటనకు బాధ్యతగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

మోదీకి చీమ కుట్టినట్లు కూడా లేదా..?
లఖింపూర్‌లో రైతులపై జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి సిట్ అధికారులు ఇచ్చిన నివేదికపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఇంతటి ఘోరమైన దుర్ఘటన జరిగినప్పటికీ కేంద్రం సరిగా స్పందించలేదని ఆమె మండిపడ్డారు. కనీసం ఈ అంశంపై చర్చించేందుకు కూడా పార్లమెంట్‌లో సమయం ఇవ్వరా ?.. అని నిలదీసారు. ప్రధాని మోదీకి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఉన్నప్పుడు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇందుకు బాధ్యతగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దీదీ.

కేంద్ర మంత్రి పాత్రపై అనుమానులు..
అటు కేంద్రంపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ కూడా తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికలో పేర్కొన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీది రైతు వ్యతిరేక మనస్తత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే కేంద్ర మంత్రిపై చర్యలు తీసుకోవడంలేని విమర్శించారు. కేంద్ర మంత్రి పాత్రపై కూడా అనుమానులు ఉన్న నేపథ్యంలో ఆయన పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు . కోర్టు మందలింపులు, సత్యాగ్రహం ఫలితంగా అజయ్ మిశ్రా కుమారుడు కుట్రపన్నాడన్న అనే విషయాన్ని ఇప్పటికైనా పోలీసులు గుర్తించారని పేర్కొన్నారు.

దూసుకెళ్లిన కాన్వాయ్ .. రైతులు మృతి..
కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా అక్టోబర్ 3న తన కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ సంఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. అనంతరం జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు అన్నదాతలు ప్రాణాలు వదిలారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ హింసాత్మక ఘటనపై సిట్ బృందం విచారణ జరిపి కోర్టుకు నివేదిక సమర్పించింది. దీంతో కేంద్రమంత్రిని తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఆందోళనలతో దద్దరిల్లిన పార్లమెంటు
మరోవైపు లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాకాండపై ప్రతిపక్షాలు ఆందోళనలతో పార్లమెంటు దద్దరిల్లింది. పోడియం వద్ద నిరసనకు దిగారు. సిట్ నివేదికతో పాటు ఈ ఘటనపై చర్చకు పట్టుపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే స్పీకర్ దానిని తిరస్కరించారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications