వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్య నాయుడి పదవి కోసం పోటీ: ప్రతిపక్షాల అభ్యర్థిగా కన్నడ మహిళ నేత: టీఆర్ఎస్ కీలకం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థి పేరు ఖరారైంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కేంద్ర మాజీమంత్రి శరద్ పవార్ కొద్దిసేపటి కిందటే ఈ పేరును ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ పేరును ప్రతిపాదించిన మరుసటి రోజే..ఈ పరిణామం చోటు చేసుకుంది.

 ఎన్డీఏ ఇదివరకే ఖరారు..

ఎన్డీఏ ఇదివరకే ఖరారు..


ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10వ తేదీన ముగియనుంది. ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అదే నెల 6వ తేదీన పోలింగ్‌ను నిర్వహించనుంది. దీనికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఎన్డీఏ నుంచి జగ్‌దీప్ ధన్‌కర్ అభ్యర్థిత్వం ఖరారైంది. రాజస్థాన్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుత పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌ను నిలబెట్టింది.

మార్గరెట్ అల్వా పేరు..

మార్గరెట్ అల్వా పేరు..

దీనితో- ప్రతిపక్ష యూపీఏ సంకీర్ణ కూటమి నాయకులు తమ అభ్యర్థిని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరెట్ అల్వా పేరును ప్రతిపాదించారు. ఈ మధ్యాహ్నం దేశ రాజధానిలోని శరద్ పవార్ నివాసంలో ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశం అయ్యారు. 17 పార్టీలకు చెందిన నాయకులు ఇందులో పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో ఎన్సీపీ తరఫున శరద్ పవార్, శివసేన నుంచి రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్, సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, సీపీఐ సీనియర్ నాయకుడు డీ రాజా ఉన్నారు.

టీఆర్ఎస్ నుంచి..

టీఆర్ఎస్ నుంచి..

రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గె, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్, డీఎంకే సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి టీఆర్ బాలు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, ఎన్సీపీ లోక్‌సభ సభ్యురాలు సుప్రియ సులే సహా పలువురు ప్రతిపక్ష పార్టీల కూటమి నాయకులు దీనికి హాజరయ్యారు. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు ఈ భేటీకి హాజరు కాలేదు.

 వెల్లడించిన శరద్ పవార్..

వెల్లడించిన శరద్ పవార్..

పలువురు నాయకుల పేర్లను పరిశీలించిన తరువాత మార్గరెట్ అల్వా పేరును ప్రతిపాదించారు. ఏకగ్రీవంగా ఖరారు చేశారు. సమావేశం ముగిసిన అనంతరం శరద్ పవార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాల తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పేరును ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రకటించారు. ఆమె పేరును పార్టీల నేతలందరూ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చెప్పారు. ఈ భేటీకి తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు హాజరు కాలేదని, వారికి ఈ విషయాన్ని తెలియజేస్తామని పేర్కొన్నారు.

ఎవరీ మార్గరెట్ అల్వా

ఎవరీ మార్గరెట్ అల్వా

మార్గరెట్ అల్వా.. కర్ణాటకకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు. మంగళూరు ఆమె స్వస్థలం. బెంగళూరులో చదువుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభకూ ప్రాతినిథ్యాన్ని వహించారు. పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశారు. గోవా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా సుదీర్థకాలం పాటు పని చేశారు.

English summary
NCP chief Sharad Pawar announced that the Opposition's candidate for the post of Vice President of India to be Margaret Alva.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X