Parliament : చర్చ లేకుండానే వ్యవసాయ చట్టాల ఆమోదం, రద్దు-ఇదేం చోద్యమంటున్న విపక్షాలు

పార్లమెంటులో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసింది. వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లు పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి పార్లమెంటు ఉభయసభల్ని విపక్షాలు స్తంభింపజేశాయి. దీనిపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టాయి. అయినా కేంద్రం ఇవేవీ పట్టించుకోకుండా వ్యవసాయ చట్టాల్ని రద్దును ఆమోదించేసింది.

దీనిపై విపక్షాలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశాయి. గతంలో వ్యవసాయ చట్టాల్ని పార్లమెంటులో చర్చ లేకుండానే ఆమోదించిన కేంద్రం.. ఇప్పుడు అవే చట్టాల్ని మళ్లీ చర్చ లేకుండానే రద్దు చేయడంపై మండిపడ్డాయి. ఇదేం ప్రజాస్వామ్యమంటూ కేంద్రాన్ని నిలదీశాయి. విపక్షాల అభ్యంతరాలు, నిరసనల మధ్య ఉభయసభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. మొదట మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడిన సభలు, అనంతరం నిరసనలు తగ్గకపోవడంతో చేసేది లేక మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడ్డాయి. ఇప్పుడు మరోసారి సమావేశమైన తర్వాత కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

opposition slams nda government for farm laws passing and repealment without discussion

పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండా వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసిన విధానంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. చర్చ లేకుండా ఆమోదించారు, చర్చ లేకుండానే రద్దు చేశారు. ఇదేం ప్రజాస్వామ్యమంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. భారత ప్రజాస్వామ్యంలో ఇదో కొత్త మోడలా అంటూ ప్రశ్నించారు. పార్లమెంటులో కేంద్రం చర్యల్ని ఎండగడుతూ అబ్దుల్లా చేసిన ట్వీట్ వైరల్ అయింది.

అనంతరం వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, 2021పై చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాము. కానీ లోక్‌సభలో ఈ బిల్లును హడావుడిగా ఆమోదించడంతో, వారు (ప్రభుత్వం) తాము రైతులకు అనుకూలంగా ఉన్నామని నిరూపించాలని అనుకుంటున్నారంటూ రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఎన్డీయే సర్కార్ ను మరో ట్వీట్ లో తప్పుబట్టారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి మాట్లాడుతున్న ఫోటోను కూడా ఈ ట్వీట్ కు జతచేశారు.

వ్యవసాయ చట్టాల రద్దును చర్చ లేకుండా నేరుగా చేయడాన్ని తప్పుబడుతున్న విపక్షాలు రైతులకు కనీస మద్దతు ధర, పెగాసస్ నిఘాపై చర్చ, క్రిప్టో కరెన్సీ, వ్యక్తిగత డేటా గోప్యత చట్టం వంటి అంశాల్ని కూడా చర్చించాలని పట్టుబడుతూ సభా కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నారు. దీంతో ఇవాళ ఉభయసభలు రేపటికి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+