తెలంగాణ ఫస్ట్: ప్రధాని, చించివేతపై రాహుల్‌కు చురక

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఎంత వరకు వచ్చిందో తాను హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను అడుగుతానని చెప్పారు. తాను వెళ్లాక పరిస్థితి ఏమిటో అడుగుతానన్నారు. తన ఆలోచనల్లో ఇప్పుడు ఇదే మొదటి ప్రధాన్యత అంశంగా మన్మోహన్ సింగ్ చెప్పారు.
జైలు శిక్ష పడ్డ ప్రజాప్రతినిధుల చట్టసభ సభ్యత్వాలను రక్షించేందుకు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ అర్థరహితమని, దానిని చించి పారేయాలన్న కాంగ్రెసు ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యల పైన కూడా స్పందించారు. రాహుల్‌కు చురకలు అంటించారు. కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్‌ను 'చించి అవతల పారేయాలి' అని రాహుల్ పేర్కొనగా... 'అలా ఎందుకు చేయాలో రాహుల్‌ను అడిగి తెలుసుకుంటాను' అని తెలిపారు.
రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో తాను రాజీనామా చేయాలంటున్న విపక్షాల డిమాండ్‌ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. రాహుల్ వ్యాఖ్యలతో తాను మనస్తాపం చెందలేదని తెలిపారు. తాను అంత ఈజీగా మనస్తాపానికి గురయ్యేవాడిని కానని తేల్చి చెప్పారు.
ఆర్డినెన్స్ నాన్సెన్స్, దానిని చించేయాలి అన్న రాహుల్ వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా... "ఎవరో చేసిన వ్యాఖ్యలకు నేను బాధ్యుడిని కాను. అయితే... అలా జరగడానికి కారణమేమిటో, దానిని ఎలా సరిదిద్దాలో ఢిల్లీకి వెళ్లగానే తెలుసుకుంటాను'' అని తెలిపారు. దీనిపై రాహుల్ వైఖరినే మార్పించగలనని పరోక్షంగా తెలిపారు. తాను రాహుల్‌ను కలిసి మాట్లాడుతానని చెప్పారు.












Click it and Unblock the Notifications