పక్కా ప్లాన్ ప్రకారమే విద్యార్థులపై దాడి: ప్రతి రాడ్డుకు ‘డిబేట్’తో జవాబంటూ ఐషే ఘోష్
Recommended Video
న్యూఢిల్లీ: ఆదివారం రాత్రి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో కొందరు వ్యక్తులు తమపై పథకం ప్రకారమే దాడికి పాల్పడ్డారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్ అన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే వసతి గృహాల్లోకి వచ్చి విద్యార్థులను బయటకు లాగి కర్రలు, రాడ్లతో దాడులు చేశారని చెప్పారు.
ఈ దాడిలు ఐషే ఘోష్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. సోమవారం ఆమె దాడి ఘటనపై మీడియాతో మాట్లాడారు. విద్యార్థులపై దాడి జరుగుతున్నా జేఎన్‌యూ భద్రతా సిబ్బంది అడ్డుకోవడానికి ముందుకు రాలేదని ఘోష్ తెలిపారు. తాము చేస్తున్న ఆందోళనలకు విఘాతం కల్పించేందుకు గత నాలుగు రోజులుగా ఆర్ఎస్ఎస్‌కు చెందిన కొందరు ప్రొఫెసర్లు హింసను ప్రేరేపించారని ఆమె ఆరోపించారు.

ఈ దాడి ఘటన నేపథ్యంలో జేఎన్‌యూ వీసీ రాజీనామా చేయాలని ఘోష్ డిమాండ్ చేశారు. జేఎన్‌యూలో ప్రజాస్వామ్య సంస్కృతిని తొక్కిపెట్టేందుకు చేసే ప్రయత్నాలు ఫలించబోవని ఐషే ఘో వ్యాఖ్యానించారు. విద్యార్థులపై ఉపయోగించిన ప్రతి ఇనుప రాడ్డుకు డిబేట్(చర్చల) ద్వారా సమాధానమిస్తామని అన్నారు.
జేఎన్‌యూ ప్రొఫెసర్ సుచిత్ర సేన్ మాట్లాడుతూ.. తనకు తొలిసారి జేఎన్‌యూలోకి వెళ్లాలంటే భయమేస్తోందని అన్నారు. ఈ దాడితో తాను తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలిపారు. ఆదివారం జరిగిన దాడి ఘటనలో ఆమె కూడా గాయపడ్డారు. దాడి చేసిన వారిలో ఎక్కువ మంది ముసుగులు ధరించి ఉన్నారని సేన్ తెలిపారు. వారి చేతిలో కర్రలు, లాఠీలు ఉన్నాయని చెప్పారు.
దాడికి పాల్పడినవారిలో ఒకరు తన తలపై రాయితో దాడి చేశారని సుచిత్ర సేన్ తెలిపారు. జేఎన్‌యూఎస్‌యూ ఉపాధ్యక్షుడు సాకేత్ మూన్ మాట్లాడుతూ.. దాడిని అడ్డుకోవాల్సిన జేఎన్‌యూ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, పోలీసులు కూడా సమాచారం ఇచ్చిన రెండు గంటల తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications