పన్నీర్ సెల్వం దూకుడు, ఎవరైతే నాకేంటి, రేపు ఏవరు టార్గెట్ ?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత అన్నాడీఎంకే పార్టీలో పలుమార్పులు కనిపిస్తున్నాయి. పన్నీర్ సెల్వం తన అనుచరులతో తప్పా శశికళ వర్గీయులతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తనపని తాను చేసుకుంటూ దూసుకు వెలుతున్నారు.
అందుకు కారణం ఢిల్లీ వెళ్లిన సమయంలో ప్రధాని మోడీ తమిళనాడు అభివృద్ది విషయంలో ఏలాంటి సహాయం కావాలన్నా చేస్తామని పన్నీర్ సెల్వంకు మాట ఇచ్చారని తెలిసింది. అంతే కాకుండా మీరు సీఎంగా ఉన్నంత వరకు ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా చేస్తాం అని పన్నీర్ సెల్వంకు బీజేపీ ప్రముఖులు మాట ఇచ్చారని సమాచారం.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ముఖ్య అనుచరుడైన ఓ. పన్నీర్ సెల్వంకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఆ రాష్ట్రానికి ఎలాంటి సహాయం కావాలన్నా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఇటీవల కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు మీడియాకు చెప్పారు.

జయలలిత స్వయంగా గతంలో పన్నీర్ సెల్వంను రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసిన విషయం మాకు గుర్తు ఉందని, ఆయనను ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, అయన ప్రజాప్రనిధి అని వెంకయ్య నాయుడు అన్నారు.
జయలలిత మరణించిన తరువాత ఆమె అడుగుజాడల్లో పన్నీర్ సెల్వం నడుచుకుంటారని మేము అనుకుంటున్నామని వెంకయ్యనాయుడు చెప్పారు. అన్నాడీఎంకే పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మాత్రం మేము (బీజేపీ) ఎలాంటి పరిస్థితుల్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు.
అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోనే అవసరం బీజేపీకి లేదని వెంకయ్యనాయుడు కుండలు బద్దలు కొట్టి చెప్పారు. మోడీతో సహ బీజేపీ సినియర్ నేత వెంకయ్య నాయుడు తదితరులు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో పన్నీర్ సెల్వం అన్నాడీఎంకేలోని మరో వర్గం గురించి ఆలోచించకుండా ముందుకు దూసుకు వెలుతున్నారు.












Click it and Unblock the Notifications