వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15 లక్షల కోట్లు డిపాజిట్టు చేశారా ? నాకు తెలియదన్న జైట్లీ , ఆంక్షలు ఎత్తివేస్తారా ?

రద్దుచేసిన పెద్ద నగదు నోట్లలో సుమారు 15 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్టు బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిల్ లించ్ అనే సంస్థలు అంచనా వేశాయి. నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలపై ఆర్ బి ఐ నిర్ణయం .

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :పెద్ద నగదును రద్దుచేసిన తర్వాత సుమారు 15 లక్షల కోట్లు బ్యాంకుల్లో 15 లక్షల కోట్లు డిపాజిట్టు అయినట్టుగా బ్యాంక్ ఆప్ అమెరికా,మెరిచ్ లించ్ అనే సంస్థలు అంచనావేశాయి.అయితే ఈ విషయమై ప్రభుత్వం మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటనచేయాల్సి ఉంది. ఆర్ బిఐ, ప్రభుత్వం సంయుక్తంగా ప్రకటన చేయనున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.

గత ఏడాది నవంబర్ 8వ, తేది రాత్రి పెద్దనగదు నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. అయితే ప్రధానంగా నల్లధనాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకొంది. రద్దుచేసిన నగదు నోట్లను గత ఏడాది డిసెంబర్ 30వ, తేది వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

గత ఏడాది డిసెంబర్ 30వ, తేది నాటికి సుమారు 15 లక్షల కోట్ల రద్దు చేసిన నగదు బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్టు బ్యాంక్ ఆఫ్ అమెరికా , మెరిల్ లించ్ అనే సంస్థలు అంచనా వేస్తున్నాయి.

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో ఎంత మొత్తం డిపాజిట్ చేశారనే దానిపై ప్రభుత్వం నుండి స్పష్టత ఇవ్వలేదు. ఇంకా దీనిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఎంత వచ్చిందో నాకు తెలియదన్న జైట్లీ

ఎంత వచ్చిందో నాకు తెలియదన్న జైట్లీ

పెద్ద నగదు నోట్ల రద్దుతో సుమారు 15 లక్షల కోట్ల రూపాయాలు బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్టు బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అనే సంస్థలు లెక్కలు తీశాయనే విషయాన్ని మీడియా ప్రతినిధులు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వద్ద ప్రస్తావిస్తే ఎంత నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేశారనే విషయమై తనకు స్పష్టత లేదన్నారు. ఆర్ బి ఐ. కేంద్రం సంయుక్తంగా ఈ విషయమై ప్రకటన చేయనున్నట్టు చెప్పారు.పెద్ద నగదు నోట్లు రద్దుచేసిన సమయంలో సుమారు 15.4 లక్షల కోట్ల రూపాయాలు చలామణీలో ఉన్నాయి.అయితే ఈ అంచనాలు కరెక్టు అయితే ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టుగానే రద్దుచేసిన నగదు బ్యాంకులకు చేరింది.

 రద్దుచేసిన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు

రద్దుచేసిన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు

రద్దుచేసిన పెద్ద నగదు నోట్లలో సుమారు 95 శాతం నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్టుచేసినట్టు అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పటికే 14.5 నుండి 15 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అవుతాయని భావించాయి.అయితే సుమారు 1.5 లక్షల కోట్లు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు,.ఈ లెక్కల ప్రకారంగా సుమారు 95 శాతం రద్దైన నోట్లు బ్యాంకులకు చేరాయని అధికారులు చెబుతున్నారు. ఇంకా ఐదు శాతం కూడ బ్యాంకులకు చేరే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.

బ్యాంకుల్లో ఎంత నగదు డిపాజిట్ పై ప్రకటించనున్న ఆర్ బి ఐ

బ్యాంకుల్లో ఎంత నగదు డిపాజిట్ పై ప్రకటించనున్న ఆర్ బి ఐ

బ్యాంకుల్లో ఎంత నగదును డిపాజిట్ అయిందనే విషయమై ఆర్ బి ఐ త్వరలోనే ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కూడ ఇదే అంశాన్ని ప్రకటించారు. 50 వేల కోట్ల వరకు స్పెషల్ డివిడెండ్ రూపంలో ఆర్ బి ఐ కు కేంద్రం అందించే అవకాశం కూడ ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

 నగదు ఉపసంహరణ పై ఆంక్షలు ఎత్తివేస్తారా?

నగదు ఉపసంహరణ పై ఆంక్షలు ఎత్తివేస్తారా?

పెద్ద నగదును రద్దుచేసిన తర్వాత బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో రద్దుచేసిన నగదు డిపాజిట్ అయింది.అయితే నగదు ఉపసంహరణపై ఇప్పటివరకు ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తారా అనే చర్చ సాగుతోంది.అయితే మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అంచనావేసిన తర్వాత ఆంక్షల ఎత్తివేతపై ఆర్ బి ఐ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.దఫా దఫాలుగా ఆర్ బి ఐ ఆంక్షలను ఎత్తివేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఆంక్షలు ఎత్తివేసే విషయంలో తమ జోక్యం ఉండదని కేంద్రం ప్రకటించింది.

English summary
over 15 lakh crore old currency deposited in banks entire country expects bank of america and merina linch organations.central governament and rbi will announcement how much old currency deposited in banks said central finance minister arun jaitley.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X