దడ పుట్టిస్తున్న 'బ్లాక్ ఫంగస్'... మధ్యప్రదేశ్‌లో బయటపడ్డ 50 కేసులు... అప్రమత్తంగా ఉండాలన్న సీఎం...

ఓవైపు కరోనా బెంబేలెత్తిస్తోంటే... మరోవైపు బ్లాక్ ఫంగస్(మ్యుకోర్‌మైకోసిస్) ఇన్ఫెక్షన్ దడ పుట్టిస్తోంది. ఇటీవల గుజరాత్‌లో కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ బయటపడిన సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ 50 బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కోవిడ్ పేషెంట్లలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై బుధవారం(మే 12) సీఎం శివరాజ్ సింగ్ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

బ్లాక్‌ ఫంగస్ చికిత్సకు ప్రోటోకాల్...

బ్లాక్‌ ఫంగస్ చికిత్సకు ప్రోటోకాల్...

బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ పట్ల వైద్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. దాని లక్షణాలు,తీవ్రత,చికిత్స,నివారణపై దృష్టి సారించాలన్నారు. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకినవారికి చికిత్స అందించే విషయంలో ప్రత్యేక ప్రోటోకాల్ పాటించనున్నట్లు తెలుస్తోంది.సీఎం సమీక్ష సమావేశం తర్వాత విడుదల చేసిన ప్రకటనలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం సమగ్ర ప్రోటోకాల్‌ను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌ హైఅలర్ట్..

మధ్యప్రదేశ్‌ హైఅలర్ట్..

మధ్యప్రదేశ్ వైద్య విద్యా శాఖ మంత్రి విశ్వాస్ కైలాష్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం మేము హై అలర్ట్‌లో ఉన్నాం... భోపాల్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ,జబల్‌పూర్‌లోని సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీలలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకినవారికి చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడి ప్రత్యేక వార్డులు 10 బెడ్ల చొప్పున సామర్థ్యాన్ని కలిగి వున్నాయి.' అని తెలిపారు. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్‌పై అధికారులు,వైద్యులతో మంత్రి విశ్వాస్ కైలాష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ సమావేశంలో అమెరికా నుంచి అక్కడి వైద్య నిపుణులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని మధ్యప్రదేశ్ వైద్యులు,మంత్రికి వారు వెల్లడించారు.

Recommended Video

    AP Police Traces Missing Oxygen Tanker On Time, 400 మంది ప్రాణాలు కాపాడిన పోలీసులు|| Oneindia Telugu
    అదే కారణమా...?

    అదే కారణమా...?


    మధ్యప్రదేశ్‌లోని భోపాల్,ఇండోర్,జబల్‌పూర్‌లలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు బయటపడ్డాయి. కోవిడ్ చికిత్స సమయంలో పేషెంట్లకు అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్లే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్‌ సోకి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల గుజరాత్‌లో 40 బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు బయటపడిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపించాయి. ఇన్ఫెక్షన్ సోకినవారిలో కొందరు కంటిచూపు కూడా కోల్పోయారు. బ్లాక్ ఫంగస్‌కి చికిత్స ఉందని... అయితే చికిత్స ఆలస్యమైనా,చికిత్స తీసుకోకపోయినా ప్రాణానికే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ సోకినవారిలో ర్మంపై మంట రావడం,చర్మం చిట్లిపోవడం,జ్వరం,దగ్గు,ఛాతి నొప్పి,శ్వాస సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+