పూరీ జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట.. 500 మందికిపైగా గాయాలు..?
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతోంది. పూరీ జగన్నాథుడి రథాన్ని లాగేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంగణం అంతా ఇసుకేస్తే రాలనంత జనంగా మారింది. పూరీలోని వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయితే భక్తులు అధిక సంఖ్యలో రావడంతో స్వల్ప తోపులాట జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ తోపులాటలో 500 మందికి పైగా భక్తులకు గాయాలైనట్లు పేర్కొన్నారు.
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. రథాన్ని లాగేందుకు ఒక్కసారిగా భక్తులు తోసుకుంటూ రావడంతో వందలాది మంది భక్తులు ఊపిరి ఆడక సొమ్మసిల్లి పడిపోయారు. ఈ తోపులాటలో దాదాపు 500 మందికి పైగా భక్తులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
#RathYatra2025: Over 500 devotees injured while pulling the Taladhwaja Chariot in Odisha's Purihttps://t.co/LyiF5VkB7b
— Mint (@livemint) June 27, 2025
ఈ ఘటనపై ఒడిశా మంత్రి ముఖేశ్ మహాలింగ్ స్పందించారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. భక్తులు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. వారిని సమీప ఆస్పత్రులకు పంపించాం. నేను దగ్గరుండి యాత్రను పర్యవేక్షిస్తున్నాను అని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎక్కడికక్కడ వైద్య క్లినిక్స్ ఏర్పాటు చేశామన్నారు.

ఇటీవల బెంగళూరులో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు అహ్మదాబాద్ లో నిర్వహించిన జగన్నాథ స్వామి రథయాత్రలో అపశ్రుతి జరిగింది. శుక్రవారం యాత్ర కొనసాగుతుండగా అందులో పాల్గొన్న ఏనుగుల్లో మూడు అదుపుతప్పి రోడ్లపైకి దూసుకొచ్చాయి. దీంతో అక్కడ ఉన్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. చివరకు జూ సిబ్బంది వచ్చి వాటిని నియంత్రించారు.












Click it and Unblock the Notifications