Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాక్ ఆర్మీ ఛీఫ్ బెదిరింపులకు ఓవైసీ కౌంటర్ ..! కేంద్రానికి కీలక సూచన..!

పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న భారత్-పాక్ మధ్య మరోసారి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. తాజాగా భారత సైనికాధికారులు వరుసగా ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా వెళ్లిన పాక్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ బెదిరింపులకు దిగారు. భారత్ తమపై దాడి చేస్తే తాము చేసే ప్రతిదాడిలో సగం ప్రపంచం నాశనం అవుతుందని హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు భారత్ కు మంట పుట్టిస్తున్నాయి. దీంతో కేంద్రం ఇప్పటికే మునీర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టింది. అణుదాడిపై బారత్ విధానం మారలేదని, తొలి దాడి తాము ఎప్పటికీ చేయబోమని తేల్చిచెప్పేసింది. ఇదే క్రమంలో పాక్ ఆర్మీ ఛీఫ్ అణు బెదిరింపులపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. ఆసిమ్ మునీర్ భారత్ పై అణుదాడి చేస్తామని చేసిన హెచ్చరికల్ని ఖండించారు. ఆయన్ను ఓ సడక్ చాప్ ఆద్మీ (పట్టించుకోకూడని వ్యక్తి) గా అభివర్ణించారు.

Owaisi Blasts Asim Munir s Nuclear Threat Urges Centre to Raise Defence Budget

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాటలు, అతని బెదిరింపులు ఖండించదగినవిగా ఓవైసీ పేర్కొన్నారు. దురదృష్టకరం ఏమిటంటే ఇది భారతదేశం యొక్క వ్యూహాత్మక భాగస్వామి అయిన అమెరికా నుండి జరుగుతోందని ఒవైసీ గుర్తుచేశారు. పాకిస్తాన్ సైన్యం , వారి ప్రభుత్వం మనకు నిరంతరం ముప్పు ఉంటుందని కేంద్రం అర్థం చేసుకోవాలని, తద్వారా మనం సిద్ధంగా ఉండగలమని ఓవైసీ తెలిపారు. ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలపై రాజకీయంగా కౌంటర్ ఇవ్వాల్సిందేనన్నారు.

పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ తన తాజా అమెరికా పర్యటనలో .. భారత్ పై బెదిరింపులకు దిగారు. భవిష్యత్తులో భారత్ తో వివాదం తలెత్తితే పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని అణుయుద్ధంలోకి నెట్టివేస్తుందని, దాదాపు సగం ప్రపంచాన్ని నాశనం చేయగలదని హెచ్చరించారుభారతదేశం సింధు నదిపై ఆనకట్ట నిర్మాణాన్ని కొనసాగిస్తే పాకిస్తాన్ తన నీటి హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటుందని తెలిపారు. అలాగే గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న రిలయన్స్ చమురుశుద్ధి కర్మాగారంపై దాడులు చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+