"ట్రంప్ ఓ బఫూన్.. అతడి బెదిరింపులకు లొంగొద్దు"

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వస్తువులపై తాజాగా 25 శాతం టారిఫ్ లు విధించారు. ఉక్రెయిన్ తో మూడేళ్ల నుంచి యుద్ధం కొనసాగిస్తున్న రష్యా.. శాంతి చర్చలకు ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. ట్రంప్ ఎన్నిసార్లు చెప్పినా రష్యా అధ్యక్షుడు పుతిన్ వినిపించుకోవడం లేదు. ఇటీవల రష్యాకు 50 రోజుల అల్టిమేటం జారీ చేశారు ట్రంప్. అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్ పై దాడులను మరింత తీవ్రతరం చేసింది. దీంతో ఆ డెడ్ లైన్ ను తాజాగా 10 రోజులకు కుదించారు. ఈ క్రమంలో రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొడితే పుతిన్ దారికొస్తారని అమెరికా భావించింది.

ఈ ప్రణాళికలో భాగంగానే రష్యా నుంచి అధిక మొత్తంలో చమురు, గ్యాస్, ఆయుధాలను కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ పగబట్టారు. ఈ క్రమంలోనే భారత్ పై తాజాగా 25 శాతం టారిఫ్ లు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పెంచిన ఈ సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటన చేశారు. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత్ లో రాజకీయ దుమారం రేపుతోంది. ట్రంప్ చర్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశిథరూర్, చిదంబరం, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ, దౌత్య సంబంధాలు దెబ్బతింటాయని ఓవైసీ అన్నారు. ట్రంప్.. శ్వేతసౌధంలో ఓ బఫూన్ అని వర్ణించారు. ఇది కచ్చితంగా భారత్ పై దాడి అని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ట్రంప్ ముందు తల వంచడం చూసి బాధగా ఉందన్నారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. రష్యాతో భారత్ వాణిజ్యం చేస్తున్నందుకు ఇది పెనాల్టీగా భావించవచ్చని ఓవైసీ అన్నారు. భారత్.. సార్వభౌమాధికారం కలిగిన దేశమని.. ఇతర దేశాలకు సలామ్ కొట్టే దేశం కాదని ఓవైసీ అభిప్రాయపడ్డారు. ఈ టారిఫ్ లు భారత్ లోని సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఐటీ సంస్థలు, సేవలు, రైతులపై ప్రభావం చూపుతాయని అన్నారు.

మరోవైపు ట్రంప్ టారిఫ్ లపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వార్నింగ్ ప్రకటించారు. ఇది సిరియస్ మ్యాటర్ అని అమెరికాలో భారత్ వాణిజ్యానికి ఇదో పెద్ద దెబ్బ అని స్పష్టం చేశారు.. రష్యా నుంచి భారత్ ముడి చమురు, ఆయుధాలను కొనుగోలు చేసినందుకు ప్రతీకారంగా ట్రంప్ సుంకాలు విధించారని అన్నారు. ప్రస్తుతం భారత్ వస్తువులపై 25 శాతం టారిఫ్ విధించారు. భవిష్యత్తులో ఇది 45 శాతానికి పెరిగినా ఆశ్చర్యం అవసరం లేదు. 100 శాతం పెనాల్టీ కూడా విధించవచ్చు. ఇది భారత్ వ్యాపారాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుందని శశిథరూర్ స్పష్టం చేశారు. అమెరికా మనకు పెద్ద మార్కెట్.. అని ట్రంప్ తన నిర్ణయాన్ని పున: సమీక్షించుకోవాలన్నారు.

Owaisi Slams Trump s 25 Tariff as Deliberate Attack on India s Economy

ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత్ తాజాగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ విధించిన 25 శాతం టారిఫ్ లు భారత్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొంది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సామరస్యంగా, నిజాయితీగా చర్చలు జరుపుతోందని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాలను కాపాడుకుంటామని కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+