50 కుక్కలను ఇంట్లో పెట్టి తాళం వేసి.. 20 రోజులుగా నరక యాతన
యజమాని జైల్లో... ఇంటి తలుపులు మూసుకుపోయాయి... లోపల మాత్రం మూగ జీవాలు ఆకలితో విలవిల్లాడాయి. మనుషుల తప్పిదాలకు జంతువులు ఎలా బలైపోతున్నాయో కళ్లకు కట్టినట్టుగా చూపిస్తోంది ఈ ఘటన. ఒక భూ వివాదం కేసు.. ఒక అరెస్ట్.. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోక పోవడంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50కి పైగా శునకాలు 20 రోజులు విలవిలాడిపోయాయి. ఆకలికి అలమటించి పోయి చివరకు నాలుగు కుక్కలు మృతి చెందాయి. ఈ విషాద ఘటన ఎక్కడ జరిగింది. అసలు ఏ జరిగిందో చూడండి
తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లా రామాయపట్టి ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ సంఘటన జంతు సంక్షేమంపై తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. ఈ ప్రాంతానికి చెందిన అళగేశన్ తన నివాసంలో 50కి పైగా శునకాలను పెంచుకుంటూ వస్తున్నాడు. అయితే, భూ వివాదానికి సంబంధించిన కేసులో 20 రోజుల క్రితం దచ్చనల్లూర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేయడంతో, అతని ఇంట్లో ఉన్న శునకాలు యజమాని లేకుండా ఒంటరిగా మిగిలిపోయాయి.
అళగేశన్ అరెస్ట్ అయిన వెంటనే, మొదట్లో ఇరుగుపొరుగువారు రెండు రోజుల పాటు శునకాలకు ఆహారం, నీరు అందించినట్లు తెలుస్తోంది. అయితే, ఆ తర్వాత ఎవ్వరూ బాధ్యత తీసుకోకపోవడంతో శునకాలు తీవ్రమైన ఆహార లేమికి గురయ్యాయి. ఇంటి తలుపులు మూసి ఉండటంతో బయటకు వెళ్లే అవకాశం లేకుండా, లోపలే నరకయాతన చూశాయి. తిండి లేదు, నీళ్లు లేక శునకాలు క్రమంగా బలహీనపడ్డాయి.

ఆకలితో నాలుగు శునకాలు మృతి
కొన్ని రోజులుగా ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన స్థానికులు అనుమానంతో జంతు సంక్షేమ కార్యకర్తలకు సమాచారం అందించారు. వారు పోలీసులకు తెలియజేసి ఇంటిని తెరిచి పరిశీలించగా, నాలుగు శునకాలు ఆకలితో మృతి చెందినట్లు గుర్తించారు. మరికొన్ని శునకాలు అత్యంత బలహీన స్థితిలో ఉండగా, కొన్ని శునకాలు జీవించేందుకు తోటి శునకాల మృతదేహాలపై ఆధారపడాల్సి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇంట్లో పెంచుతున్న శునకాలలో జర్మన్ షెపర్డ్, లాబ్రడార్, రోట్వైలర్, గోల్డెన్ రిట్రీవర్ వంటి ఖరీదైన జాతులు కూడా ఉన్నట్లు సమాచారం. సరైన ఆహారం, నీరు, వైద్య సంరక్షణ లేకపోవడంతో శునకాల ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
సమాచారం అందిన వెంటనే పలు జంతు సంక్షేమ సంస్థలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. మిగిలిన శునకాలకు తక్షణమే ఆహారం, నీరు అందించి, ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వాటిని ఊటీలోని షెల్టర్లు, సంరక్షణ కేంద్రాలకు తరలించే ప్రక్రియను ప్రారంభించారు.
ఈ ఘటనపై మానూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, యజమాని అళగేశన్‌తో పాటు శునకాల సంరక్షణ బాధ్యత తీసుకున్న వ్యక్తుల పాత్రపై కూడా విచారణ చేపట్టారు. యజమాని అరెస్ట్ అయిన తర్వాత శునకాల సంరక్షణకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు, జంతు హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications