వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Oxygen: పాకిస్థాన్ నుంచి ఆక్సిజన్ తెచ్చుకుంటాం, కేంద్రం నో, సీఎం ఫైర్, అమ్మ పెట్టదు, అడుక్కుంటే ?

|
Google Oneindia TeluguNews

చెన్నై/ పంజాబ్: భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో శత్రుదేశాలను ఆశ్రయించే పరిస్థితి ఎదురైయ్యిందంటే భారత్ లో కరోనా దెబ్బ పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుంతోందని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. మేము పాకిస్థాన్ నుంచి ఆక్సిజన్ తెప్పించుకుంటామంటే కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదని, ఇప్పుడు మాకు కష్టాలు ఎదురౌతున్నాయని ఓ సీఎం సంచలన ఆరోపణలు చేశారు. మా రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి పాకిస్థాన్ నుంచి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ( LMO) తెప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదని కేంద్ర ప్రభుత్వం మీద ఓ సీఎం ఆరోపణలు చెయ్యడం కలకలం రేపింది.

Bed Scam: పరుపుల బిజినెస్, పడుకుంటే రూ. లక్ష, నిన్న ఆంటీ, నేడు త్రిమూర్తులు, డీలింగ్ !Bed Scam: పరుపుల బిజినెస్, పడుకుంటే రూ. లక్ష, నిన్న ఆంటీ, నేడు త్రిమూర్తులు, డీలింగ్ !

సీఎం అమరీందర్ సింగ్ ఆరోపణలు

సీఎం అమరీందర్ సింగ్ ఆరోపణలు


పంజాబ్ లో కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో అక్కడి ప్రజలు హడలిపోతున్నారు. మా రాష్ట్ర ప్రజలు కాపాడుకోవడానికి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకోవాలని మా ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తే అక్కడి నాయకులు తిరస్కరించారని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఓ ప్రకటన విడుదల చెయ్యడం కలకలం రేపింది.

 మోదీ విఫలం అయ్యారు

మోదీ విఫలం అయ్యారు

పంజాబ్ కు సకాలంలో ఆక్సిజన్ సరఫరా చెయ్యడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలం అయ్యారని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆరోపించారు. పంజాబ్ ప్రజలు ఆదుకోవడానికి వెంటనే అవసరమైన ఆక్సిజన్ సరఫరా చెయ్యాలని ప్రధాని నరేంద్ మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ లేఖ రాశారు.

ఆక్సిజన్ ట్యాంకర్లు పంపించండి

ఆక్సిజన్ ట్యాంకర్లు పంపించండి

పంజాబ్ కు వెంటనే 50 MT MLOలు, 20 ట్యాంకర్ల ఆక్సిజన్ పంపించాలని, బొకారో నుంచి రైలు మార్గంలో మాకు ఆక్సిజన్ సరఫరా చెయ్యాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు. సరైన సమయంలో ఆక్సిజన్ అందకపోవడంతో పంజాబ్ లో ఎక్కవ ప్రాణనష్టం జరుగుతోందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విచారం వ్యక్తం చేస్తున్నారు.

అక్కడి నుంచి మాకు రావాలి

అక్కడి నుంచి మాకు రావాలి

పంజాబ్ కు ప్రస్తుతం బయట రాష్ట్రాల నుంచి 195 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోంది. అందులో 90 మెట్రిక్ టన్నులు తూర్పు భారతదేశంలోని బొకారో నుంచి వచ్చిందని, మిగిలిన 105 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వస్తున్నాయని సీఎం అమరీందర్ సింగ్ గుర్తు చేస్తున్నారు.

ఏం చేస్తారో మీరే చెయ్యండి

ఏం చేస్తారో మీరే చెయ్యండి


పంజాబ్ కు రావలసి ఆక్సిజన్ సరైన సమయంలో మా రాష్ట్రానికి అందడం లేదని, అందుకే మేము పాకిస్థాన్ నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకోవాలని అనుకుంటే అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

English summary
Oxygen: Punjab had proposed to import oxygen from Pakistan, Centre rejected. says CM Amarinder Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X