వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనోరమ న్యూస్ కాంక్లెవ్ 2019 : దేశం వృద్ధి దిశగా పయనిస్తోందన్న ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశంలో నైపుణ్యం ఉన్న యువత ఎక్కువ ఉందని గుర్తుచేశారు. భారత్ సరికొత్త దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. 130 కోట్ల మంది గొంతుక న్యూ ఇండియా అని తెలిపారు. మలయాళ మనోరమ గ్రూపునకు సంస్థకు చెందిన 2019 కాంక్లెట్ ఎడిషన్‌ను ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఉన్న వనరులు .. అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

నేను రేప్ లు, హత్యలు చెయ్యలేదు, ట్రబుల్ షూటర్, ఢిల్లీ పెద్దల రాజకీయ కక్ష, ఈడీ ఎంట్రీ !నేను రేప్ లు, హత్యలు చెయ్యలేదు, ట్రబుల్ షూటర్, ఢిల్లీ పెద్దల రాజకీయ కక్ష, ఈడీ ఎంట్రీ !

దేశ ప్రజల ఆలోచనలు మారుతున్నాయని గుర్తుచేశారు ప్రధాని మోడీ. క్రీడ విభాగాల్లో ఇండియా రాణిస్తోందని తెలిపారు. 130 కోట్ల మంది ప్రజలు ప్రేక్షకులు ఉండిపోయేందుకు సిద్దంగా లేరన్నారు. జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాల్లో రూ.లక్ష కోట్ల నగదు జమ అయ్యిందని గుర్తుచేశారు. అంతేకాదు ఆర్థికంగా బాగున్న వారు గ్యాస్ సబ్సిడీని కూడా వదులుకున్నారని పేర్కొన్నారు.

P M Modi inaugurated Manorama News Conclave 2019 via video-conference

అంతకుముందు కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ 'న్యూ ఇండియా-ద గవర్నమెండ్ అండ్ మీడియా' అనే అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్, కేరళ ఆర్థికమంత్రి థామస్, టీఎంసీ ఎంపీ మహువా తదితరులు పాల్గొన్నారు.

భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని మోడీ పేర్కొన్నారు. ఏ దేశంలో లేని వనరులు మనకు ఉన్నాయని పేర్కొన్నారు. యువత జనాభా శాతం ఎక్కువ ఉండటం .. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి .. దేశాభివృద్ధికి తోడ్పాడుతున్నామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇండియా ప్రపంచంలో బలమైన దేశంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

English summary
Prime Minister Narendra Modi inaugurated the Manorama News Conclave 2019 via video-conferencing from New Delhi at 10 am on Friday. The 2019 edition of the conclave, organised by the Malayala Manorama Group, is on the compelling theme of ‘New India’. Union Minister of Information and Broadcasting, Environment, Forest and Climate Change Prakash Javadekar would deliver the keynote address on ‘New India―the government and media’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X