వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పి.రామ్మోహన్ రావు ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకం లోనూ, తొలగింపులోనూ వివాదాస్పదమే

తమిళనాడు రాస్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పి. రామ్మోహన్ రావు నియామకం , తొలగింపు కూడ వివాదాస్పదంగా మారింది. సీనియర్లను కాదని , ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జయలలిత నియమించారు. అం

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పి . రామ్మోహన్ రావు నియామకం నుండి తొలగింపు వరకు వివాదంగానే ముగిసింది. జయలలిత కార్యదర్శిగా ప్రారంభమైన ఆయ ప్రస్థానం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. అయితే జయలలితకు అత్యంత సన్నిహితుడుగా ఆయనకు పేరుంది ఈ కారణంగానే ఆయనను ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్భిగా నియమించింది. ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడం కూడ వివాదంగా మారింది.

2011 లో జయలలిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలను స్వీకరించిన తర్వాత ఆమె కార్యదర్శిగా పి. రామ్మోహన్ రావు భాద్యతలను స్వీకరించారు. ఆనాటి నుండి ఆయన వెనుతిరిగి చూడలేదు. జయకు అత్యంత విశ్వాస పాత్రుడిగా ఆయనకు పేరుంది.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పి. రామ్మోహన్ రావు 1985 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారి రామ్మోహన్ రావు. తమిళనాడు బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారి, సబ్ కలెక్టర్ గా ఆయన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమైంది. ఎక్కువ కాలం తమిళనాడు రాష్ట్రంలో పలు శాఖల్లో ఆయన పనిచేశారు.

p. rammohan rao; contravorsy of chief secretary appointment

నియామకం కూడ వివాదమే

2016 సంవత్సరంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జానదేశికన్ ను తొలగించి ఆయన స్థానంలో పి. రామ్మోహన్ రావును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జయలలిత నియమించారు. ఈ నియామకం వివాదాస్పదంగా మారింది.సీనియర్ ఐఎఎస్ అధికారులను కాదని రామ్మోహన్ రావును నియమించడం కూడ కారణంగా మారింది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జానదేశికన్ ను అర్థాంతరంగా తొలగించడంపై వివాదంగా మారింది. ఆ నియామకంపై ఆనాడు పెద్ద దుమారం రేగింది.

జయకు అత్యంత విశ్వాసం ఉన్నందునే ఆయనను ఆమె రామ్మోహన్ రావు ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించుకొన్నారని చెబుతారు. తమిళనాడు రాష్ట్ర అధికారవర్గాల్లో ఆయన చక్రం తిప్పారు. ఆయన చెప్పిందే వేదం.జయ నెచ్చెల్లి శశికళ, రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కు కూడ ఆయన సన్నిహితంగానే మెలిగేవారు.వీరిద్దరికీ కూడ ఆయన ఆర్తిక వ్యవహరాల్లో సలహదారుగా వ్యవహరించారనే ప్రచారం ఉంది.సీనియర్లను కాదని ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడం కూడ వివాదమైంది.

తొలగింపు కూడ వివాదమే

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్మోహన్ రావు ఇంటిపై ఆదాయపు పన్నుశాఖాధికారులు దాడులు నిర్వహించారు. రెండు రోజులుగా ఆయన ఇంటిపై ఆదాయపు పన్నుశాఖాధికారులు దాడుటు నిర్వహించి బారీగా నగదును, బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువులు ఇంటిపై దాడులు నిర్వహించారు. టిటిడి సభ్యుడు శేఖర్ రెడ్డి ద్వారా రామ్మోహన్ రావు వ్యవహరం బయటకు వచ్చిందని ఆదాయపు పన్ను శాఖాధికారులు అభిప్రాయంతో ఉన్నారు. ఈ దాడుల నేపథ్యంలో పి. రామ్మోహన్ రావును సిఎస్ భాద్యతల నుండి ప్రభుత్వం తప్పించింది. ఆయన స్థానంలో గిరిజ వైద్యనాథన్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.సిఎస్ ఇంటి మీద ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం బహుశా ఇదే ప్రథమం.రామ్మోహన్ కంటే సీనియర్ ఐఎఎస్ అదికారి గిరిజ వైథ్యనాథన్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది ప్రభుత్వం.

English summary
p.rama mohanrao first shot into prominence when the was appointed private secretary to then chief minister jayalalita when she assumed office in 2011, he served as her secretary till mid2016, in june 2016, in a surprise move he was appointed as chief secretary.controversy about his chief secretary appointment, when income tax officers raid on his houses governament remove him from chief secretary post, instead of him governament choose girija vydyanathan as a chief secretary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X