పద్మశ్రీ అవార్డు గ్రహీత.. 128 ఏళ్ల యోగా గురువు కన్నుమూత.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, 128 ఏళ్ల యోగా గురువు బాబా శివానంద్ కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి వారణాసిలో ఆయన మృతి చెందారు. బాబా శివానంద్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాబా శివానంద్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం కోసం వారణాసిలోని కబీర్‌నగర్ కాలనీలోని ఆయన నివాసంలో ఉంచారు. ఈ రోజు సాయంత్రం బాబా శివానంద్ అంత్యక్రియలు జరుగుతాయని శిష్యులు తెలిపారు.

బాబా శివానంద్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు అధికారిక ఖాతా ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. " యోగా గురువు బాబా శివానంద్ మృతి చెందారన్న విషయం తెలుసుకుని బాధపడ్డాను. ఆయన మృతి నన్ను కలిచివేసింది. ఆయన తన లైఫ్ ను యోగా, సాధన కోసం కృషి చేశారు. యోగా ద్వారా ప్రజలకు ఆయన చేసిన సేవకు పద్మశ్రీ అవార్డు అందింది. ఆయన మరణం వారణాసితోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన శిష్యులకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పిస్తున్నాను" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
योग साधक और काशी निवासी शिवानंद बाबा जी के निधन से अत्यंत दुख हुआ है। योग और साधना को समर्पित उनका जीवन देश की हर पीढ़ी को प्रेरित करता रहेगा। योग के जरिए समाज की सेवा के लिए उन्हें पद्मश्री से सम्मानित भी किया गया था।
— Narendra Modi (@narendramodi) May 4, 2025
शिवानंद बाबा का शिवलोक प्रयाण हम सब काशीवासियों और उनसे… pic.twitter.com/nm9fI3ySiK
మరోవైపు బాబా శివానంద్ మృతిపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ నివాళులు అర్పించారు. "యోగాలో ఆయన కృషి మరువలేనిది. మీరు యోగా ద్వారా చేసిన కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను బాబా విశ్వనాథ్ ను ప్రార్థిస్తున్నాను. ఆయన శిశ్యులకు ధైర్యం ఇవ్వాలని వేడుకుంటున్నా. ఓమ్ శాంతి" అని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ట్వీట్ చేశారు.
Baba Shivanand, 128-Year-Old Padma Shri Awardee, has passed away due to health complications. He was admitted to BHU Hospital in Varanasi on April 30 after experiencing health issues.
— Diksha Kandpal🇮🇳 (@DikshaKandpal8) May 4, 2025
Om Shanti🙏 pic.twitter.com/AdUq36fEoE
బాబా శివానంద్.. 1896 ఆగస్టు 8 సిల్ హెత్ (ప్రస్తుత బంగ్లాదేశ్) జిల్లాలో జన్మించినట్లు వారి శిష్యులు ద్వారా తెలుస్తోంది. ఆరేళ్ల వయసులోనే శివానంద తల్లిదండ్రులు మరణించగా ఆయన బంగాల్లోని ఓ ఆశ్రమంలో పెరిగారు. ఆ తర్వాత శివానంద్ గురు ఓంకారనంద్ శిక్షణలో పెరిగారు. ఓంకారానంద్ వద్దే బాబా శివానంద్ ఆధ్యాత్మిక విద్య, జీవిత బోధనలు నేర్చుకున్నారు. అయితే యోగా, ఆధ్యాత్మికతకు ఆయన చేసిన కృషికి గాను బాబా శివానంద్ కు 2022 లో పద్మశ్రీ అవార్డు లభించింది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications