• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పద్మశ్రీ ఆకలికి చీమ గుడ్లు తింటున్నాడు.. ఆ అవార్డు నాకు వద్దు మొర్రో అంటున్నాడు!

|

భువనేశ్వర్ : అవార్డు .. కీర్తిని ఇనుమడింపజేస్తోంది. పేరు తీసుకోస్తోంది. కానీ కొందరికీ మాత్రం అవార్డు చేటు కూడా చేస్తోంది. అదేంటి అవార్డు .. చేడు చేయడం ఏంటీ ? దాంతో ప్రయోజనాలే కదా ఉంటాయి ? పొట్ట నింపకపోవడం ఏంటి అని మెదడు తొలచివేస్తుందా ? అయితే ఈ స్టోరీ చదవండి.

భగీరథుడే .. కానీ ...

భగీరథుడే .. కానీ ...

పక్క చిత్రంలో కనిపిస్తోన్న వ్యక్తి పేరు ధారైత్రి నాయక్. 70 ఏళ్ల వయస్సు గల నాయక్ ఒడిశా. అయితే తన వారి సాగునీటి బాధల కోసం భగీరథ ప్రయత్నం చేశాడు. గోనసిక పర్వతాలలో మూడు కిలోమీటర్ల పొడవైన కాలువను తవ్వాడు. దీంతో కేంద్ర ప్రభుత్వం అతనిని గుర్తించి పద్మశ్రీ పురస్కారం అందజేసింది. పద్మ శ్రీ అంటే మాములు విషయం కాదు. అయితే అవార్డుతో నగదు ఏం రాకపోయినా .. పేరు మాత్రం వస్తోంది. కానీ నాయక్ కడుపేద కుటుంబానికి చెందినవారు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు కూలీ పనులు చేస్తాడు. అయితే అవార్డు వచ్చాక ఆయన స్థాయి పెరిగిందని ఎవరు పనులకు పిలవడం లేదు.

శ్రమకు తగిన గుర్తింపు ...

శ్రమకు తగిన గుర్తింపు ...

తమ గ్రామ ప్రజల కోసం దాదాపు 3 కిలోమీటర్ల పైన ఉన్న కొండపైకి తాగునీటిని తీసుకొచ్చేందుకు నాయక్ శ్రమించారు. ఇందుకోసం శ్రమించాడు. దీనిని గుర్తించిన ప్రభుత్వం అవార్డుతో సరిపెట్టింది. అయితే అవార్డు తీసుకున్నాక అతనికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. అవార్డుతో నాయక్ గొప్పవాడు అయిపోయాడని స్థానికులు భావిస్తున్నారు. అందుకే ఆయనను ఎవరు పనికి పిలవడం లేదు. దీంతో కుటుంబ పోషణ కోసం ఏం చేయాలో తెలియక మదనపడిపోయాడు. అంతేకాదు తమలపాకులు, మామిడి తొక్కలు కూడా విక్రయించాడు. అయినా కుటుంబ పోషణ భారమైంది. దీంతో చీమల గుడ్లను తినడం ప్రారంభించారు. సాధారణంగా అదీ కూడా ఆయనకు ఇష్టం లేదు. కానీ తాను బతికేందుకు ఏదో ఒకటి తినాలి కాబట్టి చీమల గుడ్లను తింటూ కాలం వెళ్లదీస్తున్నాడు.

చేటే ...

చేటే ...

తనకు పద్మ శ్రీ అవార్డు రావడం మంచి కన్నా చేడే చేసింది.దీంతో తనకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. చేసే పని లభించడం లేదని నాయక్ వాపోయాడు. తాను పెద్దవాడినైపోయానని ప్రజలు తనకు పని అప్పగించేందుకు ఇష్టపడటం లేదని చెప్పారు. దీంతో తన కుటుంబం బతికి బట్టకట్టేందుకు చీమల గుడ్లను తింటున్నామని పేర్కొన్నారు. దీంతోపాటు తమలపాకులు, మామిడి తొక్కలు కూడా విక్రయిస్తున్నా .. ఫలితం లేకపోయిందని చెప్తున్నాడు. అవార్డుతో తన ఉపాధి పోయిందని .. దీంతో అవార్డు వెనక్కి ఇచ్చేయాలని భావిస్తున్నానని పేర్కొన్నాడు. అవార్డు తిరిగొచ్చాక .. తనకు లేబర్ పని లభిస్తుందని గుర్తుచేశారు. దీంతో తన కుటుంబాన్ని పోషించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dharaitri Naik, a 70-year-old hailing from the state of Odisha who single-handedly dug a three-km-long canal in the Gonasika mountains, was conferred with Padma Shri in 2019. The man had used a crowbar to carve the canal in order to bring drinking water from a stream. He now wants to return the award to the government, however, as he believes that it has destroyed his source of livelihood. His work has not really been appreciated and the villagers taunt him about becoming rich, saying that manual labour is below his dignity. The ‘Mountain Man of Odisha’ is now forced to eat ant eggs in order to survive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more