పద్మ శ్రీ పురస్కారం: తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు వీరే..
పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 119 మందికి పద్మ అవార్డులతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వం. విడుదల చేసింది. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులకు పద్మశ్రీలు రావడం విశేషం అని చెప్పుకోవచ్చు.
Recommended Video

అన్నవరపు రామస్వామికి కళారంగంలో పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఈయన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవర ప్పాడు గ్రామం. అలాగే నిడమోలు సుమతీకి కూడా అవార్డు వచ్చింది. ఆమెకు కూడా కళారంగంలోనే అవార్డు వరించింది. సాహిత్యంలో అసవాది ప్రకాశ్‌రావుకు పద్మశ్రీ పురస్కారం వరించింది. ఇతని స్వగ్రామం అనంతపురం జిల్లా, సింగనమల మండలం కొరివిపల్లి గ్రామం.
ఇక తెలంగాణ విషయానికి వస్తే కళారంగంలో శ్రీ కనకరాజుకు అవార్డు దక్కింది. కొమురంభీం జిల్లా జైనూరు మండలం మార్లవాయికి చెందిన ఆయన.. ఆదివాసీ సాంస్కృతిక వైభవం గుస్సాడీకి గుర్తింపు తెచ్చారు. ఇదీ ఆదివాసీ సమాజానికి దక్కిన గౌరవమని ఆదివాసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వీరితో పాటు.. దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి పద్మ విభూషణ్.. గాయని చిత్రకు పద్మభూషణ్ అవార్డులు వరించాయి. వీరిద్దరూ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులే.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications