'పహల్గామ్ తరహాలో మరో దాడి'.. ఇండియన్ ఆర్మీ హెచ్చరిక
పహల్గామ్ తరహాలోనే మరోదాడి జరగొచ్చని వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ తరహాలోనే మరోసారి దాడికి పాల్పడేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నుతోందని తెలిపారు. ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉందని దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్ లో నిర్వహించిన ఎక్స్ సర్వీస్ మెన్ ర్యాలీలో కటియార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పహల్గామ్ తరహాలో మరోసారి భారత్ పై పాకిస్థాన్ దాడి చేసే ప్రమాదం ఉందని వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు. ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. పాకిస్థాన్ ఎలాంటి ఘటనకు పాల్పడినా సమర్థవంతంగా ఎదుర్కొని దాడిని తిప్పికొట్టేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ మేరకు పాకిస్థాన్ కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు.
" పాకిస్థాన్ మరోసారి మనపై దాడికి పాల్పడొచ్చు. పహల్గామ్ లాంటి మారణహోమం సృష్టించాలని వాళ్లు పదే పదే కాచుకుని ఉంటారు. మనం అలెర్ట్ గా ఉండాలి. నేను మాటిస్తున్నా. భారత ఆర్మీ సిద్ధంగా ఉంది. పాకిస్థాన్ ఎలాంటి ఘటనలకు పాల్పడినా సమర్థవంతంగా తిప్పికొడతాం" అని వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ తెలిపారు.
1965 ఇండో- పాక్ యుద్ధం నేటితో 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జమ్ము కాశ్మీర్ లో ఎక్స్ సర్వీస్ మెన్, మిలిటరీ సిబ్బంది సంయుక్తంగా ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో పాల్గొన్న కటియార్.. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఎటాక్ తర్వాత భారత్.. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
‘Pakistan again attempted a nefarious terror attack but Indian Army responded strongly’: West Army Commander Lt. Gen Manoj Kumar Katiyar warns against another Pahalgam-like attack
— Republic (@republic) October 14, 2025
Tune in to LIVE TV for all the fastest #BREAKING alerts - https://t.co/d88C3t2tGa pic.twitter.com/7EWGB955PA
" పహల్గామ్ ఎటాక్ లో ఉగ్రవాదులు మన దేశంలోని అభాగ్యులను చంపేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్థాన్ కు భారత ఆర్మీ బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ విజయానికి కారణం.. కేంద్ర ప్రభుత్వం మద్దతు, ఆర్మీ ప్రణాళిక, మాజీ సైనికుల అడ్వైజ్, స్థానిక ప్రజలు" అని కటియార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిసిగట్టుగా పనిచేస్తేనే ఆపరేషన్ సింధూర్ విజయం సాధ్యం అయిందన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా టెర్రర్ మౌలిక వసతులను కుప్పకూల్చామన్నారు. సరిహద్దు గుండా పాకిస్థాన్ సాగిస్తున్న ఉగ్ర కార్యకలాపాలను తిప్పికొట్టామని వివరించారు.

మరోవైపు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ సమావేశంలో పాల్గొని ఇండియన్ ఆర్మీని ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆర్మీ తెగువ ప్రదర్శించిందని తెలిపారు. టెర్రర్ మూలాలను నిర్మూలించిందని వివరించారు. ఈ మేరకు 26వ ఇన్ ఫాంట్రీ డివిజన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్మీ అధికారులు, సైనికులు పాల్గొన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications