ఉగ్రదాడి వేళ మానవత్వం- హిందూ టూరిస్టుల్ని కాపాడి ప్రాణాలు కోల్పోయిన ముస్లిం..!
దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ కొండ ప్రాంతంలోని బైసరన్‌లోని పచ్చని పచ్చిక బయళ్లలో నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడిలో దాదాపు 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్ధితి ఇంకా ఆందోళన కరంగానే ఉంది. అయితే ఈ ఉగ్రవాదిపై యావత్ భారతావని మండిపడుతోంది. ఇలాంటి సమయంలో ఉగ్రదాడి సమయంలో చోటు చేసుకున్న ఓ ఘటన మానవత్వానికి మచ్చుతునకగా నిలిచింది.
నిన్న పహల్గాంలో ఉగ్రదాడి సమయంలో భయభ్రాంతులకు గురైన పర్యాటకులపై ఉగ్రవాదులు బుల్లెట్లు వర్షం కురిపిస్తుండగా.. ఒక వ్యక్తి తన కోసం కాకుండా ఇతరుల కోసం జీవితం, మరణం మధ్య నిలబడాలని నిర్ణయించుకున్నాడు. స్ధానికంగా గుర్రపు బండి తోలుకునే 28ఏళ్ల సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఉగ్రవాద దాడి సమయంలో ఒక సమూహ పర్యాటకులను రక్షించడానికి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించేశాడు.

ఈ దాడి జరుగుతున్న సమయంలో తమ మతాన్ని చెప్పమని ఉగ్రవాదులు హిందువుల్ని బలవంతం చేస్తున్న వేళ ఆదిల్ హుస్సేన్ వారికి దగ్గరగా వెళ్లి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తద్వారా చాలా మంది అక్కడి నుంచి పారిపోయేందుకు సహకరించాడు. ఇదంతా గమనిస్తున్న తీవ్రవాదులు.. ఆదిల్ హుస్సేన్ ను అదే రైఫిల్ తో కాల్చిచంపారు.

అక్కడ కాల్పులు జరుగుతున్న సమయంలో పారిపోవడానికి బదులుగా, ఆదిల్ ఉగ్రవాదులలో ఒకరి వైపు దూసుకెళ్లి ఆయుధాన్ని లాక్కుని వెళ్ళడానికి ప్రయత్నించాడని, పర్యాటకులు తప్పించుకునే అవకాశం కల్పించిన క్షణంలో అతను వారి చూపు మళ్లించేందుకు ప్రయత్నించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కానీ ఈ ప్రయత్నంలో అతను విజయం సాధించలేకపోయినా చాలా మంది హిందువుల్ని కాపాడగలిగాడు. కానీ తన ప్రాణాలు కోల్పోయాడు.
Visited Pahalgam today to offer Fatiha for brave heart Syed Adil Hussain Shah, who was shot dead while trying to snatch a weapon from one of the terrorists in a courageous attempt to protect the tourists he had ferried on horseback from the parking area to Baisaran meadow. Met… pic.twitter.com/VrxR4gJ3tO
— Office of Chief Minister, J&K (@CM_JnK) April 23, 2025
ఆదిల్ హుస్సేన్ విషాద మరణం అతని కుటుంబాన్ని దుఃఖంలో ముంచెత్తింది. తమకు న్యాయం చేయాలని అతని తల్లి కన్నీరు పెడుతోంది. ఆదిల్ తమకున్న ఏకైక అండ అని, అతను గుర్రాలపై స్వారీ చేసి కుటుంబానికి డబ్బు సంపాదించేవాడని తల్లి ఏడుస్తూ చెప్పింది. ఇప్పుడు తమకు సాయం చేయడానికి మరెవరూ లేరంది. అతను లేకుండా తామేం చేయాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో ఆదిల్ హుస్సేన్ అంత్యక్రియల్లో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొని వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంత్‌నాగ్ జిల్లాలోని హపత్నార్‌లో సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications